చక్రం తిప్పేదెవ్వరు..ఢిల్లీ కోటపై పాగా వేసేదెవ్వరు..? - పోటీ రసవత్తరం జనం ఉత్కంఠ భరితం

కమలం వికసించేనా..హస్తం హవా నడిచేనా..ప్రాంతీయ పార్టీల జెండా ఎగరేనా..! వంద కోట్ల భారతావని ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. కొద్ది రోజుల్లో ఎవరు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంటారనేది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమున్నత జాతి అంతా ఒకే తాటిపై నిలిచింది. ఈసారి ఎన్నికలు ..సమర్థతకు..నీతికి..నిజాయితీకి..అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రజలు , యువతీ యువకులు తమ భవిష్యత్ బాగుండాలని సముచిత నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. తాయిలాలు, సబ్సిడీలు..సంక్షేమ పథకాలు ఎర వేసి ఓట్లు రాబట్టుకునే పార్టీలకు చుక్కలు చూపిస్తామంటున్నారు. దేశమంతటా మోడీ గాలి వీసినా చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు తమ హవాను కొనసాగించాయి. ఎన్ని ప్రయత్నాలు మోడీ, అమిత్ షా చేసినా ఢిల్లీ కోటపై కమలం జెండా ఎగుర వేయలేక పోయారు. సమాచార హక్కు చట్టం కోసం ప్రపంచమంతా తన వైపు తిప్పుకునేలా చేసిన ఘనత ఒక్క అరవింద్ కేజ్రివాల్‌కే దక్కుతుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రజాస్వామిక దేశంగా వినుతికెక్కిన ఇండియాలో 17వ లోక్‌సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం...