ద్రవ్య లోటుపై రాజన్ ఆవేదన

నిన్నటి దాకా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ చిలుక పలుకులు పలుకుతూ జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. కానీ బయటకు అంతా సవ్యంగానే ఉందని అగుపిస్తున్నా లోలోపట మాత్రం భారతీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారి పోయిందని విపక్షాలు, ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మోడీ పట్టించు కోవడం లేదు. ఇదే సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టార్ ప్రమాదకరంగా తయారైందని హెచ్చరించారు. భారత ద్రవ్య లోటు సవ్యంగా లేదని స్పష్టం చేశారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశానికి రాజన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆసియాలోనే ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2016లో భారత వృద్ధి రేటు 9 శాతం ఉండగా, క్రమ క్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడి పోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారు. దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటోందని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకు...