కమేడియన్ శ్రీనివాస్ రెడ్డికి జగన్ గిఫ్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. గతంలో ఏపీలో ఎన్నికల ప్రచారంతో పాటు వైఎస్సార్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు శ్రీనివాస్ రెడ్డి. హాస్య నటుడిగా, హీరోగా ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకున్నారు. తన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఒక్కరొక్కరికి సముచిత స్థానం కల్పిస్తున్నారు. తనను నమ్ముకుని, తన ఉన్నతి కోసం పాటుపడిన వారికి అరుదైన పదవులు కట్టబెట్టారు ఏపీ సీఎం. అంతకు ముందు వైసీపీకి తెలుగుసినిమా రంగంలో చాలా మంది చేయిచ్చారు. కానీ కొంత మంది నటులు మాత్రమే జగన్ వెంట నడిచారు. వారిలో ముందు వరుసలో నిలిచారు కమెడియన్స్ ప్రుత్వి రాజ్, ఆలీ, శ్రీనివాస్ రెడ్డి తో పాటు డాక్టర్ రాజశేఖర్, జీవిత, తదితరులు ఉన్నారు. ఇటీవలే ఆలీకి, పృథ్వీ రాజ్ కు ప్రోటోకాల్ ఉన్న పదవులు కట్టబెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్ కు చైర్మన్ గా పృథ్వీ ని నియమించారు. ఇప్పటికే ఆయన భాద్యతలు చేపట్టారు. దాని ప్రక్షాళన కూడా స్టార్ట్ చేసారు.
గతంలో అందులో జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డికి ‘తిరుమల శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు’ డైరెక్టర్ పదవి తో పాటు ప్రముఖ టీవీ యాంకర్ స్వప్నను కూడా డైరెక్టర్‌గా జగన్ సర్కార్ ఎంపిక చేసింతలు సమాచారం. శ్రీనివాస్ రెడ్డికి డైరెక్టరుగా బాధ్యతలు అప్పగించడంపై టాలీవుడ్‌లో ఆనందం వ్యక్తమవుతోంది. శ్రీనివాస్ రెడ్డి మిత్ర బృందంతో ఏర్పడ్డ ‘ఫ్లయింగ్ కలర్స్’ ప్రత్యేకంగా అభినందిస్తోంది. కాగా శ్రీనివాస్ రెడ్డిది స్వస్థలం ఖమ్మం జిల్లా. 2001 లో ఇష్టం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు. ఇడియట్, డార్లింగ్, ఎఫ్ -2 , అమర్ అక్బర్ ఆంటోనీ, అరవింద సమేత, పంతం, జంబ లకిడి పంబ, చల్ మోహన్ రంగ, వీడెవడు, ఆనందో బ్రహ్మ , అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమాల్లో కీ రోల్ పోషించారు.
జయమ్ము నిక్షయమ్మురా, ప్రేమమ్, భలే భలే మగాడివోయ్, ఒక లైలా కోసం , రేసు గుర్రం, భీమవరం బుల్లోడు, షాడో , అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఈగ, దరువు, అయ్యారే, సోలో సినిమాల్లో మెప్పించాడు. వీర, దూకుడు, కందిరీగ, నమో వెంకటేశాయ, మళ్ళీ మళ్ళీ, జగద్గురు షిర్డీ సాయి బాబా, బెండు అప్పారావు ఆర్ ఎంపీ, రాత్రి, ఆర్యా -2 , కాసుకో, ఆంజనేయులు, పరుగు, బ్లేడ్ బాబ్జి, లక్ష్మీ కళ్యాణం, యమదొంగ, దేశముదురు, దుబాయి శీను, ఒక విచిత్రం, సారీ నాకు పెళ్లయింది, సూరి బాబు, విజయం, నాగా, ఇష్టం, భాషా సినిమాల్లో నటించాడు శ్రీనివాస్ రెడ్డి. గీతాంజలి సినిమాలో హీరోగా నటించాడు. మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డిని మెచ్చుకోక తప్పదు. తన కోసం ఉన్న వారికి తనను గుర్తు పెట్టుకునేలా సపోర్ట్ చేస్తున్నారు. గ్రేట్ కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి