తమిళ సినిమాను షేక్ చేస్తున్న బిజిల్
ఇండియాలో తెలుగు, తమిళ్ సినిమాలు పోటాపోటీగా దూసుకెళుతున్నాయి. నిన్న బాహుబలి, సాహో, గద్దలకొండ గణేష్, సైరా సినిమాలు కలెక్షన్స్ లలో సునామి సృష్టిస్తుండగా తాజాగా తమిళ్ లో సినిమా విడుదల కాకుండానే సంచలనం కల్గిస్తోంది బిజిల్. ఇది పూర్తిగా ఆట ప్రధానంగా సాగే సినిమా. సన్ టీవీ యాజమాన్యం దీని రైట్స్ కొనుగోలు చేసింది. అయితే ఎంత మొత్తానికి తీసుకుందన్న వైషయాన్ని వెల్లడించలేదు. ఈ మూవీలో ప్రముఖ యాక్టర్, రైజింగ్ స్టార్ గా పేరున్న విజయ్ తో పాటు అందాల తార నయనతార నటించారు. ట్రైలర్ ను దర్శకుడు అత్లీ విడుదల చేశాడు. యూట్యూబ్ ను షేక్ చేస్తూ ఒకే ఒక్క రోజులోనే కోటిన్నరకు పైగా బిజిల్ ను చూశారు. దీంతో మూవీ విడుదల అయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తోందనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బిజిల్ సినిమాకు అత్లీ దర్శకత్వం వహించారు. కలపతి అఘోరామ్, ఎస్. గణేష్, ఎస్. సురేష్ లు నిర్మించారు. దీనికి కథను అత్లీ, రమణ గిరివాసన్ సమకూర్చారు. విజయ్, నయనతార తో పాటు వివేక్, ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, కాతిర్, యోగి బాబు నటించారు. బిజిల్ సినిమాకు సంగీతాన్ని దిగ్గజ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ అందించారు. కెమెరా విభాగాన్ని జీకే విష్ణు చేపట్టారు. ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్ బిజిల్ ను సమర్పిస్తుంది. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్ టైన్మెంట్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి వర్క్ పూర్తయి పోయింది. పోస్టర్స్ కూడా విడుదల చేశారు. అత్లీ దీనిని మరింత జనరంజకంగా తీశారు.
అంతకంటే ఎక్కువగా విజయ్ నటన దుమ్ము రేపింది. ఇక రెహమాన్ తన మార్క్ తో ఆకట్టుకున్నాడు. కాగా బిజిల్ సినిమాను 180 కోట్లు పెట్టి తీశారు. అయితే ఈ సినిమాలో అజయ్ రాయప్పన్, మైకేల్ పాత్రలో నటిస్తుండగా నయనతార ఏంజిల్ పాత్రలో జీవించింది. మొత్తం మీద బిజిల్ సినిమా రికార్డులు బద్దలు కొట్టేందుకు..రెడీ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ చుసిన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వావ్ అంటూ ట్వీట్ చేయడం తో ఒక్కసారిగా బిజిల్ ఇండియాలో వైరల్ గా మారింది. ఎంతైనా విజయ్ అంటేనే ఓ ట్రెండ్. ఓ సెన్సేషన్. ఎంతైనా తమిళ్ సినిమా రూటే సపరేట్ కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి