దివాళా అంచున దేశం..?

గత పాలకుల వైఫల్యం, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం 130 కోట్ల సమున్నత భారతం పాలిట శాపంగా మారింది. ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దివాళా అంచున నిలబడ్డది. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక, కళా, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాలన్నీ కునారిల్లి పోయాయి. దేశానికి దిశా నిర్దేశం చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద వున్న కోట్లాది రూపాయలను ప్రస్తుత సర్కార్ కు ఇటీవలే సమకూర్చింది. నెలనెలా దినదినగండం అర్దాయుస్సు లాగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులలో పెదాలు, సామాన్యులు, ప్రజలు కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ దొంగలు, ఎగవేతదారులకు దోచి పెట్టారు. తాజాగా 70 వేల కోట్లు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించాయి.

ఏ ముహూర్తాన నోట్ల రద్దు ప్రకటించారో అప్పటి నుంచి నేటి దాకా భారత ఆర్ధిక రంగం గాడిన పడలేదు. అమెరికా పర్యటన సందర్బంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత రంగాలు మరింత బలపడేందుకు జీఎస్టీ ద్వారా విధించిన పన్నులను తగ్గించింది. దీంతో ఎన్నడూ లేని విధంగా ఇండియన్ మార్కెట్ రంగం, స్టాక్ మార్కెట్ సెక్టార్స్ రాకెట్ కంటే వేగంగా దూసుకు వెళ్లాయి. తర్వాత డీలా పడ్డాయి. ఇన్ని చర్యలు చేపట్టినా ఆర్థిక వృద్ధి రేటులో మార్పు రాలేదు. వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆశించగా అది కూడా వర్కవుట్ కాలేదు. సరికదా మరింత సంక్షోభం లోకి కూరుకు పోయింది. ఓ వైపు కొలువులు లేక కోట్లాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

 ప్రపంచంలో మనకంటే ఎక్కువ జనాభా కలిగి, తక్కువ వనరులు కలిగిన డ్రాగన్ చైనా ఆర్థిక రంగంలో అమెరికాకు ధీటుగా పోటీ పడుతోంది. దానిని చూసైనా మనం నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది. ప్రపంచ మార్కెట్ కూడా అంత భరోసాను ఇవ్వడం లేదు. అరబ్ కంట్రీస్ పై ఆయిల్ కోసం ఆధారపడటం తో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీని దెబ్బ మొత్తం వ్యాపార రంగాన్ని, ఫైనాన్షియల్ సెక్టార్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ రోజు వరకు వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగుతూ పోతూ ఉంటే దేశం దివాళా తీయడం ఖాయమంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇప్పటికైనా విపక్షాలపై విమర్శలు మానుకుని దేశ భవిశ్యత్తుపై ఆలోచిస్తే మంచిది. ఒక్క ఈ కామర్స్, ఐటీ రంగాలు తప్పా ఇంకే రంగమూ గాడిన పడడం లేదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!