ఉద్యోగాల ఊసేది..దేశానికి దిక్కేది..!
భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయిందని, ఉద్యోగాల కల్పన అన్నది కలగానే మిగిలిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ రోజు వరకు పరిస్థితిని చక్కదిద్ద కుండా కాకమ్మ కబుర్లు చెబుతూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారంటూ ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను ద్రుష్టి మరల్చేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కోట్లాది యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రభుత్వం చంద్రుడిని చూడాలని చెబుతోందని ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2ను ఉటంకిస్తూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ కలిసి జనాన్ని మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో డోక్లాం ప్రతిష్టంభన గురించి ప్రస్తావించారా అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. లాతూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. 2017లో చైనా దళాలు భారత భూభాగంలో ప్రవేశించడాన్ని ప్రస్తావిస్తూ ఇది మేకిన్ ఇండియా కాదని మేకిన్ చైనా అని ఎద్దేవా చేశారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను ప్రస్తావించ కుండా బీజేపీ నేతలు మూన్‌మిషన్, ఆర్టికల్ 370 అంటూ దాట వేస్తున్నారని అన్నారు. రైతులు, నిరుద్యోగులు సమస్యలతో సతమతమవుతుంటే 15 మంది సంపన్నులకు చెందిన 5.5 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు.
నోట్ల రద్దుతో ఎవరికి లాభం చేకూరిందని రాహుల్ ప్రశ్నించారు. నోట్ల రద్దు ఎవరికీ మేలు చేయకుంటే తనను ఉరి తీయాలని మోదీ అన్నారని కానీ ఆ నిర్ణయం ఎవరికీ ప్రయోజనం కలిగించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నీరవ్ మోదీ వంటి వారు దేశాన్ని వీడి పరారయ్యారని చెప్పుకొచ్చారు. చంద్రుడిపైకి రాకెట్ పంపితే మహారాష్ట్రలోని ప్రజల పొట్టలో అది తిండి నింపలేదని వ్యంగ్యంగా అన్నారు. పేదల జేబుల్లో డబ్బును కొల్లగొట్టి పెద్దలకు పంచేందుకే నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వెనుక ఉద్దేశమని మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా గ్రహించి ప్రజలు కాంగ్రెస్, ఎన్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి