అయ్యో మహేషా ఎందుకిలా
తెలుగు బుల్లి తెరపై మిగతా ఛానల్స్ ప్రోగ్రామ్స్ కు ఝలక్ ఇస్తూ రేటింగ్ లో దూసుకు పోతోంది. ఎంతైనా స్టార్ టీవీ రూటే సపరేట్ అంటున్నారు ఎంటర్టైన్మెంట్ వర్గాలు. ఇదిలా ఉండగా తెలుగులో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో ఇది మూడో ఎపిసోడ్. మొదటి బిగ్ బాస్ షో ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తే రెండో బిగ్ బాస్ ఎపిసోడ్ ను నటుడు నాని హోస్ట్ చేశారు. కానీ అందరి కంటే భిన్నంగా నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ మూడో ఎపిసోడ్ మాత్రం స్టార్ మా టీవీకి లెక్కలేనంత పేరు తీసుకు వచ్చింది. అంతే కాకుండా పెట్టిన ఖర్చుకు రెట్టింపు డబ్బులు వచ్చాయి. ఈ ప్రోగ్రాం ను చైనా దిగ్గజ మొబైల్ కంపెనీలు ఒప్పు, వివో తో పాటు హైదరాబాద్ లో పేరున్న పలు కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయి.
దీంతో పేరుతో పాటు ప్రచారం లభిస్తోంది. అంతే కాకుండా మా టీవీకి ఆదాయమూ సమకూరుతోంది. ఇదిలా ఉండగా తాజా ఎపిసోడ్ బిగ్ బాస్ లో కొంత ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. అందరూ మహేష్ వెళ్లిపోవడంపై భాధను వ్యక్తం చేశారు. ఓట్ల శాతంలో తేడా రావడంతో మహేష్ ఎలిమినేట్ కాక తప్పలేదు. మొత్తం మీద రాహుల్..రితికాల మధ్యనే ఫైనల్ ఉండబోతున్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి నటి పునర్నవి బాంబు పేల్చింది. తాను రాహుల్ ను ప్రేమించడం లేదని, తామిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేసింది. ఎవరు విజేతగా నిలుస్తారనేది త్వరలోనే తేలనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి