పోస్ట్‌లు

డిసెంబర్ 13, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

దిశ చట్టం చారిత్రాత్మకం

చిత్రం
మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ చట్టం చారిత్రాత్మకమని ఆ రాష్ట్ర సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన రాగానే వెన్నులో వణుకు పుట్టించేలా రాష్ట్రంలో ఈ చట్టం తీసుకొచ్చామన్నారు. ప్రతి మహిళకు భద్రత, భరోసా కల్పిస్తూ దీన్ని రూపొందించామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినప్పుడు వేగవంతమైన దర్యాప్తు, విచారణ నిర్వహించి.. శిక్ష ఖరారు చేసినప్పుడు మాత్రమే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నిరోధానికి, సత్వర న్యాయం కోసం రూపొందించిన ‘ఏపీ దిశ’ బిల్లుపై చర్చ జరిగింది.  దిశ చట్టం విప్లవాత్మక నిర్ణయమని, దీనిపై దేశమంతా చర్చ జరుగుతుందని జగన్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ క్రిమినల్‌ ప్రక్రియ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం అవసరమన్నారు. దిశ చట్టంలో చేస్తున్న సవరణలు రాష్ట్రపతి వరకు వెళ్తున్నందున దేశమంతా తెలిసి చర్చ జరుగుతుందని.. ఆ దిశగా మిగతా రాష్ట్రాలు ఆలోచించేందుకు మనం శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ కొత్త చట్టంతో నేరం జరిగిన తర్వాత ఏడు పని ...

తిరుగులేని టీమిండియా

చిత్రం
ప్రపంచ క్రికెట్ లో టీమిండియా దూసుకెళుతోంది. నిలకడ కలిగిన ఆటగాళ్లతో అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. వన్డేలు, టీ-20 , టెస్ట్ మ్యాచుల్లో సైతం భారత జట్టుకు ఎదురే లేకుండా పోతోంది. ప్రస్తుతం మన జట్టుతోవెస్టిండీస్‌ తలపడుతోంది. మాంచి ఊపు మీదున్న మన క్రికెటర్లను కట్టడి చేసేందుకు నానా తంటాలు పడుతోంది వెస్టిండీస్‌ జట్టు. ఇప్పటికే ఒక సిరీస్ కోల్పోయి చతికిల పడింది. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం రెడీ అవుతోంది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌నే శాసించిన వెస్టిండీస్‌...80వ దశకంలో భారత్‌పై కూడా గర్జించింది. కానీ ఆ తర్వాత సీన్‌ మారింది. భారత్‌ గేర్‌ మార్చుకుంది. వన్డేల్లో సొంత గడ్డపై కరీబియన్‌ను మట్టి కరిపిస్తూనే ఉంది. గడిచిన పుష్కర కాలంగా 4 వన్డేల సిరీస్‌ జరిగినా, 5 వన్డేల్లో తలపడినా, 3 వన్డేలు ఇలా సిరీస్‌ ఏదైనా విజేత మాత్రం టీమిండియానే. అంతగా రాటుదేలింది మనజట్టు. గతంలో వెస్టిండీస్‌ ఇటు వన్డేల్లో, అటు టి20ల్లో రెండేసి సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఒకప్పుడు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో, ఎదురు దాడి బ్యాటింగ్‌తో ప్రపంచ ప్రత్యర్థుల్నే వణికించిన ఈ జట్టు క్రమంగా ప్రాభవం కోల్పోయింది. తమ దీవుల్లో జరిగే కరీబ...

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్

చిత్రం
ప్రపంచ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరతీసిన ఒకే ఒక్క నాయకుడు, మార్గదర్శకుడు, పాలకుడు, పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అలియాస్ కేసీఆర్. సవాళ్ళను ఎదుర్కోవడం అంటే చాలా మంది జడుసుకుంటారు. కానీ కేసీఆర్ కు సవాళ్ళను స్వీకరించడం అంటే భలే సరదా. బహుభాషా కోవిదుడిగా ఎంతో అనుభవం పొందిన ఆయన ఏది మాట్లాడినా లేదా ఏది చేసినా అది నిమిషాల్లోపే దేశమంతటా వైరల్ అవుతోంది. లెక్కలేనన్ని ఆరోపణలు, విమర్శలు, దూషణలు వచ్చాయి. వాటినన్నిటినీ ఆయన ఈజీగా తీసుకున్నారు. ఇదే కేసీఆర్ స్పెషాలిటీ. దేశంలో ఏ సీఎంకు లేనంతటి విజన్ ఉన్నది. అందుకే అతనంటే చాలా మందికి భయం. ఎంతో అనుభవం కలిగిన మీడియా ఎక్స్పర్ట్స్ కు కూడా ఝలక్ ఇచ్చే ఒకే ఒక్క లీడర్..లివింగ్ లెజెండ్ కేసీఆర్. ప్రతి సమస్యకు పరిష్కరించే నేర్పు, ఓర్పు, పాలనా దక్షతలో ఆయనకు ఆయనే సాటి. వ్యక్తిగతంగా చాలా మంది నేతలు, విపక్షాలు విభేదించినా ఆచరణ లోకి వచ్చే సరికల్లా పాలనా పరంగా ఎంతో పరిణితి సాధిస్తే కానీ టార్గెట్ చేరుకోలేం. సమున్నత భారత రాజ్యాంగాన్ని అవపోసన పట్టిన ఈ అధినేతకు ప్రత్యర్థులను చిత్తు చేయడం అంటే సరదా. అదో గేమ్ కూడా. శత్రువులు లేకుండా ఉండ...

చూడ ముచ్చట..ఒక్కటైన జంట

చిత్రం
జీవితాన్ని వెలిగించే సాధనాల్లో పెళ్లి ఒక గొప్ప జ్ఞాపకం. అంతకంటే గొప్ప అనుభవం..తెలియని అనుభూతి. ప్రతి ఒక్కరు కొత్త ప్రపంచంలోకి వెళ్లే అరుదైన సన్నివేశం వివాహం. రెండు కుటుంబాలు, మనసుల మధ్య బంధం అనేది కలకాలం గుర్తు పెట్టుకోవాల్సింది. అందరూ పెళ్లి చేసుకుంటారు. కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం హిస్టరీ క్రియేట్ చేస్తాయి. ఇలాంటి అద్భుతమైన వివాహం, సన్నివేశం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భారత క్రికెట్ లో జగమెరిగిన క్రికెటర్ గా పేరున్న వ్యక్తి మహమ్మద్ అజహరుద్దీన్. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరొకరు టెన్నీసా స్టార్ గా పేరున్న సానియా మీర్జా. ఈ రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. అది మ్యారేజీ రూపంలో. అజహారుద్దీన్ కుమారుడు ..సానియా మీర్జా చెల్లెలు ఒక్కటయ్యారు. ఈ వివాహం కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అజహరుద్దీన్‌ తనయుడు అసద్‌తో ఆనం మీర్జాతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వంకాయ రంగు లెహెంగా ధరించిన ఆనం, పక్కనే అసద్‌ బంగారు రంగు షెర్వానీ ధరించి నిలుచుని ఉన్న ఫోటోలను ఆనం తన ఇన్‌స్...

స్మృతి ఫైర్..రాహుల్ డోంట్ కేర్

చిత్రం
ఏదో రకంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ దేశంలో వైరల్ అవుతున్నారు. ఇది కూడా ఒకందుకు మంచిదే అంటూ కాంగ్రెస్ అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అత్యాచార ఘటనల నేపథ్యంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు రేపిస్టులను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. ఈ క్రమంలో రాహుల్‌ క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీ ఎంపీలు పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచార పర్వాలు కొనసాగడం గురించి రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇది మేకిన్‌ ఇండియా కాదు. రేపి ఇన్‌ ఇండియా అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఓ యువతిపై అత్యాచారం చేసినా  స్పందించడం లేదన్నారు రాహుల్ గాంధీ. ఈ విషయంపై స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత మహిళలపై అత్యాచారాలకు పాల్పడాలంటూ ఓ నాయకుడు పిలుపునివ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. తన వ్యాఖ్యలతో రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలను కుంటున్నారు. ఆయనను శిక్షించాల్సిందే. తన వ్యాఖ్యలపై రాహు...

అయ్యారే..అయ్యర్

చిత్రం
టీమిండియాలో నిలకడగా ఆడే ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడని అన్నారు మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే. అయితే ఈ ఆటగాడిని పూర్తిగా వాడు కోవడం లేదని ఆవేదన చెందాడు. ఈ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ విఫలం అవుతోందంటూ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పదే పదే మార్చడాన్ని ప్రధానంగా తప్పుబట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో అయ్యర్‌ను ఐదు, ఆరు స్థానాల్లో పంపడాన్ని ప్రస్తావించాడు. ఆ స్థానాల్లో అయ్యర్‌ను పంపడం సరైనది కాదని స్పష్టం చేశాడు. ఒక క్వాలిటీ ఆటగాడైన అయ్యర్‌కు కీలకమైన నాల్గో స్థానమే కరెక్ట్‌ అని కుంబ్లే అభిప్రాయ పడ్డాడు. రాబోవు వన్డే సిరీస్‌లో అయ్యర్‌ను నాల్గో స్థానంలో పంపాలని సూచించాడు. శిఖర్‌ ధావన్‌ జట్టులో లేని కారణంగా కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ ఓపెనింగ్‌ చాన్స్‌ చేసే అవకాశం వచ్చింది. దీంతో అయ్యర్‌ను నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడానికి ఆస్కారం ఉంటుంది. మనం అయ్యర్‌ ఆటను చూస్తునే ఉన్నాం. అత్యంత నిలకడగా నాణ్యమైన క్రికెట్‌ ఆడుతున్నాడు. అతన్ని మళ్లీ నాల్గో స్థానంలో చూడాలనుకుంటున్నా అని పేర్కొన్నాడు. కాగా, విండీస్‌ వన్డే సిరీస్‌ కఠినంగానే ఉంటుందనే అభిప్రాయ...

ఆరామ్‌కో..అదుర్స్

చిత్రం
వరల్డ్ వైడ్ గా సౌదీ అరేబియా ఆయిల్ దిగ్గజ కంపెనీ ఆరాం కో చరిత్ర సృష్టించింది. స్టాక్‌ మార్కెట్‌ అరంగేట్రం అదిరి పోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్‌ ధరను తాకింది. ఈ ధర వద్ద కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లు. అంటే మన రూపాయల్లో 132.5 లక్షల కోట్లు అన్నమాట. ఈ షేర్‌ మరో 10 శాతం పెరిగితే సౌదీ అరేబియా పాలకులు ఆశించిన 2 లక్షల కోట్ల డాలర్ల విలువ గల కంపెనీ అనే మైలురాయిని సాదీ ఆరామ్‌కో చేరనున్నదని అంచనా. సౌదీ ఆరామ్‌కో కంపెనీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇతర ఐదు చమురు కంపెనీలు ఎక్సాన్‌ మొబిల్, టోటల్, రాయల్‌ డచ్‌ షెల్, షెవ్రాన్, బీపీ మొత్తం మార్కెట్‌ విలువ కన్నా కూడా సౌదీ ఆరామ్‌కో కంపెనీ విలువే ఎక్కువ కావడం విశేషం. వచ్చే ఐదేళ్ల పాటు ఏడాదికి 7,500 కోట్ల డాలర్ల చొప్పున డివిడెండ్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ యోచిస్తోంది. కాగా ఐపీఓ ద్వారా 1.5 శాతం వాటా షేర్లను విక్రయించి 2,560 కోట్ల డాలర్లు సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. ఇప్పటి వరకూ 2,500 కోట్ల డాలర్లతో అలీబాబా పేరిట ఉన్న అతి పెద్ద ప్రపంచ ఐపీఓ రికార్డ్‌ను సౌదీ ఆరామ్‌క...

అమ్మకానికి ఆస్తులు రెడీ

చిత్రం
మోదీ కొట్టిన దెబ్బకు భారతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. విత్త మంత్రి ఎన్ని ఉద్దీపన చర్యలు చేపట్టినా ఫలితం అగుపించడం లేదు. ట్రాయ్ పరిధిలోకి వచ్చే టెలికాం కంపెనీలన్నీ తమ అప్పుల నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచిస్తున్నాయి. అంతే కాకుండా తమ ఆస్తుల విక్రయించేందుకు రెడీ అంటున్నాయి. ఇప్పటికే సుప్రీం కోర్టు ఇచ్చిన షాక్ తో దిగ్గజ ప్రయివేట్ టెలికాం కంపెనీలన్నీ లబోదిబోమంటున్నాయి. గడువు కేవలం మూడు నెలలు మాత్రమే ఇవ్వడంతో అన్ని కంపెనీలు కొనుగోలుదారుల కోసం క్యూ కడుతున్నాయి. తాజాగా భారీ రుణ భారంతో కుదేలైన వొడాఫోన్‌ ఐడియా కంపెనీ ఆస్తుల విక్రయానికి వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తోనూ, నవీ ముంబైలో ఉన్న డేటా సెంటర్‌ను అమ్మేయడానికి ఎడెల్‌వీజ్‌ గ్రూప్‌తోనూ ఐడియా చర్చలు జరుపుతోందని సమాచారం. వొడాఫోన్‌ ఐడియా కంపెనీ తన 1,56,000 కిమీ ఆప్టిక్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని విక్రయించడానికి బ్రూక్‌ ఫీల్డ్‌ సంస్థతో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. ఈ వ్యాపారం విలువ దాదాపు 200 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. ఇక నవీ ముంబైలోని డేటా స...

నిమిషాల్లో పర్సనల్ లోన్స్

చిత్రం
ఒకప్పుడు అప్పు చేయడం అంటే నామోషీగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ కాలం మారింది. ప్రతిదీ మనీతో ముడిపడి ఉండడంతో రుణాలు చేయక తప్పడం లేదు. తమ వ్యాపారాన్ని విస్తరించు కోవడంలో భాగంగా దిగ్గజ కంపెనీలన్నీ ఈజీగా లోన్స్ ఇచ్చే పనిలో పడ్డాయి. అప్పు కావాలంటే సవాలక్ష నిబంధనలు. కానీ ఇవేవీ అక్కర్లేకుండానే కొన్ని నిమిషాల లోపే వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేస్తున్నాయి చాలా ఫైనాన్సియల్ కంపెనీలు. టెక్నాలజీలో వచ్చిన మార్పులు కొత్త ఆలోచనలకు రెక్కలు తొడిగేలా చేస్తున్నాయి. డబ్బులు తీసు కోవాలన్నా లేదా అవసరమైనప్పుడు కావాలనుకున్నా చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు డిజిటల్ మీడియా పుణ్యమా అంటూ డబ్బులు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా, ఎవ్వరికైనా క్షణాల్లో పంపించే సౌకర్యం అందుబాటు లోకి వచ్చింది. అన్నీ చూసుకున్నాకే ఆయా కంపెనీలు డబ్బులు అప్పుగా ఇస్తాయి. ఏ మాత్రం ఈఎంఐ లు కట్టక పోతే వడ్డీల మోత మోగుతుంది. అందుకే ఇటు వైపు జనం వెళ్లడం లేదు. తాజాగా మొబైల్స్ కంపెనీలలో సేల్స్ లలో టాప్ రేంజ్ లో ఉన్న షావోమి డిజిటల్ ఫైనాన్స్ సెక్టార్ లోకి అడుగు పెట్టింది. ఇదే చైనాలోని షెన్‌జెన్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ... ...

త్వరలో అమెజాన్ టీవీలు

చిత్రం
ఈ కామర్స్ రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ అమెజాన్ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోకి ఎంటర్ కాబోతోంది. ఇప్పటికే చైనాకు చెందిన మొబైల్స్, టీవీల కంపెనీలు ఇండియాను, ఆసియా దేశాలను ఆక్రమించేశాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ ఫీచర్స్ అందజేస్తున్నాయి. అతి పెద్ద మార్కెట్ వనరుగా భారత్ గత కొన్నేళ్లుగా విరాజిల్లుతోంది. దీంతో దిగ్గజ కంపెనీలతో పాటు కార్పొరేట్ కంపెనీలు సైతం ఇండియా జపం చేస్తున్నాయి. తాజాగా అమెజాన్ కంపెనీ ఒనిడా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఫైర్‌ టీవీ బ్రాండ్‌ స్మార్ట్‌ టీవీలను భారత్‌లో ప్రవేశ పెట్టనుంది. ఇందు కోసం ఒనిడా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 32 అంగుళాల ఒనిడా ఫైర్‌ టీవీ స్మార్ట్‌ టీవీ ధర 12,999 కాగా, 43 అంగుళాల టీవీ ధర 21,999 నిర్ణయించింది. ఈ నెలలోనే మార్కెట్ లోకి రానున్నాయి. ఈ టీవీలు కావాలనుకునే వాళ్ళు అమెజాన్‌ వెబ్ పోర్టల్‌లో బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఈ ఫుల్‌ హెచ్‌డీ టీవీల్లో బిల్టిన్‌ వైఫై, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 1 యూఎస్‌బీ పోర్టు, 1 ఇయర్‌ఫోన్‌ పోర్టు తదితర ఫీచర్స్‌ అందుబాటులో ఉంచింది. ఫైర్‌ టీవీ స్మార్ట్‌ టీవీలను 2018లో అమెరికా, కెనడాలో...