దిశ చట్టం చారిత్రాత్మకం
మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ చట్టం చారిత్రాత్మకమని ఆ రాష్ట్ర సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన రాగానే వెన్నులో వణుకు పుట్టించేలా రాష్ట్రంలో ఈ చట్టం తీసుకొచ్చామన్నారు. ప్రతి మహిళకు భద్రత, భరోసా కల్పిస్తూ దీన్ని రూపొందించామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినప్పుడు వేగవంతమైన దర్యాప్తు, విచారణ నిర్వహించి.. శిక్ష ఖరారు చేసినప్పుడు మాత్రమే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నిరోధానికి, సత్వర న్యాయం కోసం రూపొందించిన ‘ఏపీ దిశ’ బిల్లుపై చర్చ జరిగింది.
దిశ చట్టం విప్లవాత్మక నిర్ణయమని, దీనిపై దేశమంతా చర్చ జరుగుతుందని జగన్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రక్రియ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం అవసరమన్నారు. దిశ చట్టంలో చేస్తున్న సవరణలు రాష్ట్రపతి వరకు వెళ్తున్నందున దేశమంతా తెలిసి చర్చ జరుగుతుందని.. ఆ దిశగా మిగతా రాష్ట్రాలు ఆలోచించేందుకు మనం శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ కొత్త చట్టంతో నేరం జరిగిన తర్వాత ఏడు పని దినాల్లోనే సాక్ష్యాధారాల సేకరణతో పాటు, కేసు దర్యాప్తు పూర్తి కావాలని, ఆ తర్వాత 14 పని దినాల్లో విచారణ పూర్తై దోషులకు ఉరిశిక్ష పడుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి.. 2014లో 13,549 కేసులు నమోదు కాగా, 2015లో 13,088, 2016లో 13,948, 2017లో 14,696, 2018లో 14,048 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యాచార కేసులు 2014లో 937, 2015లో 1,014, 2016లో 969, 2017లో 1,046, 2018లో 1,096 నమోదయ్యాయి. చిన్నపిల్లలకు సంబంధించి చాలా ఎక్కువ నేరాలు జరిగాయి. బాలికలపై అత్యాచారాలు, నేరాలకు సంబంధించి 2014లో 4,032 కేసులు, 2015లో 4,114, 2016లో 4,477, 2017లో 4,672, 2018లో 4,215 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టే, అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలే అయినా, పరిస్థితి మార్చాలనుకున్నాం. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి