త్వరలో అమెజాన్ టీవీలు
ఈ కామర్స్ రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ అమెజాన్ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోకి ఎంటర్ కాబోతోంది. ఇప్పటికే చైనాకు చెందిన మొబైల్స్, టీవీల కంపెనీలు ఇండియాను, ఆసియా దేశాలను ఆక్రమించేశాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ ఫీచర్స్ అందజేస్తున్నాయి. అతి పెద్ద మార్కెట్ వనరుగా భారత్ గత కొన్నేళ్లుగా విరాజిల్లుతోంది. దీంతో దిగ్గజ కంపెనీలతో పాటు కార్పొరేట్ కంపెనీలు సైతం ఇండియా జపం చేస్తున్నాయి. తాజాగా అమెజాన్ కంపెనీ ఒనిడా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఫైర్ టీవీ బ్రాండ్ స్మార్ట్ టీవీలను భారత్‌లో ప్రవేశ పెట్టనుంది.
ఇందు కోసం ఒనిడా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 32 అంగుళాల ఒనిడా ఫైర్ టీవీ స్మార్ట్ టీవీ ధర 12,999 కాగా, 43 అంగుళాల టీవీ ధర 21,999 నిర్ణయించింది. ఈ నెలలోనే మార్కెట్ లోకి రానున్నాయి. ఈ టీవీలు కావాలనుకునే వాళ్ళు అమెజాన్ వెబ్ పోర్టల్‌లో బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఈ ఫుల్ హెచ్‌డీ టీవీల్లో బిల్టిన్ వైఫై, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 1 యూఎస్‌బీ పోర్టు, 1 ఇయర్‌ఫోన్ పోర్టు తదితర ఫీచర్స్ అందుబాటులో ఉంచింది. ఫైర్ టీవీ స్మార్ట్ టీవీలను 2018లో అమెరికా, కెనడాలో అమెజాన్ పవ్రేశపెట్టింది. ఈ ఏడాది బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా తదితర దేశాల్లోకి విస్తరించింది.
ఇందు కోసం డిక్సన్స్ కార్‌ఫోన్, మీడియా మార్కెట్ శాటర్న్, గ్రండిగ్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. భారత్‌లో ఒనిడాతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇతర సంస్థలతో కూడా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని ఫైర్ టీవీ డివైజెస్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సందీప్ గుప్తావెల్లడించారు. అయితే అమ్మకాల లక్ష్యాలను మాత్రం వెల్లడించ లేదు. అమెజాన్ ప్రస్తుతం భారత్‌లో ఫైర్ టీవీ స్ట్రీమింగ్ స్టిక్‌లు, ఎకో, కిండిల్ వంటి ఉత్పత్తులు విక్రయిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి