నిమిషాల్లో పర్సనల్ లోన్స్


ఒకప్పుడు అప్పు చేయడం అంటే నామోషీగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ కాలం మారింది. ప్రతిదీ మనీతో ముడిపడి ఉండడంతో రుణాలు చేయక తప్పడం లేదు. తమ వ్యాపారాన్ని విస్తరించు కోవడంలో భాగంగా దిగ్గజ కంపెనీలన్నీ ఈజీగా లోన్స్ ఇచ్చే పనిలో పడ్డాయి. అప్పు కావాలంటే సవాలక్ష నిబంధనలు. కానీ ఇవేవీ అక్కర్లేకుండానే కొన్ని నిమిషాల లోపే వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేస్తున్నాయి చాలా ఫైనాన్సియల్ కంపెనీలు. టెక్నాలజీలో వచ్చిన మార్పులు కొత్త ఆలోచనలకు రెక్కలు తొడిగేలా చేస్తున్నాయి. డబ్బులు తీసు కోవాలన్నా లేదా అవసరమైనప్పుడు కావాలనుకున్నా చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు డిజిటల్ మీడియా పుణ్యమా అంటూ డబ్బులు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా, ఎవ్వరికైనా క్షణాల్లో పంపించే సౌకర్యం అందుబాటు లోకి వచ్చింది.

అన్నీ చూసుకున్నాకే ఆయా కంపెనీలు డబ్బులు అప్పుగా ఇస్తాయి. ఏ మాత్రం ఈఎంఐ లు కట్టక పోతే వడ్డీల మోత మోగుతుంది. అందుకే ఇటు వైపు జనం వెళ్లడం లేదు. తాజాగా మొబైల్స్ కంపెనీలలో సేల్స్ లలో టాప్ రేంజ్ లో ఉన్న షావోమి డిజిటల్ ఫైనాన్స్ సెక్టార్ లోకి అడుగు పెట్టింది. ఇదే చైనాలోని షెన్‌జెన్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ... డిజిటల్‌ రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెలాఖరు నుంచి మన దేశంలో రుణ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి వచ్చే వారం న్యూఢిల్లీలో ఒక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంక్‌లు, ప్రైవేట్‌ ఆర్థిక సంస్థలతో ఈ మేరకు సంస్థ ఒప్పందం చేసుకుంది.

18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌కు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. లక్ష వరకు రుణాన్ని 5 నిమిషాల్లో మంజూరు చేయడం దీని ప్రత్యేకత. ఇటీవలే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ షావోమీ.. ఎంఐ క్రెడిట్‌ పేరిట డిజిటల్‌ లెండింగ్‌లోకి ప్రవేశించడం తెలిసిందే. గత ఏడాది మేలో దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రియల్‌మీ ప్రవేశించింది. ప్రస్తుతం మన దేశంతో పాటూ చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ వంటి 20 దేశాల్లో అమ్మకాలు చేస్తోంది. ఈ ఏడాది దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రియల్‌మీ14.3 శాతం మార్కెట్‌ వాటాతో కొనసాగుతోంది. మొత్తం మీద అప్పు ఇచ్చు వాడు ధన్యుడు సుమతి అన్న పద్యం గుర్తుకు వస్తోంది. 

కామెంట్‌లు