అరెస్టులు..ఆందోళనలు

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల దీక్ష టెన్షన్ కలిగిస్తోంది ఛలో ట్యాంక్‌బండ్ ఆందోళన కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదు. అయినా ఎట్టి పరిస్థితుల్లో చేపట్టి తీరుతామని జేఏసీ, విపక్షాలు ప్రకటించాయి. తెలంగాణ అంతటా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరో వైపు సుప్రీం కోర్టు అయోధ్యపై తీర్పు ప్రకటించనుంది. దీంతో దేశమంతటా, రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక వివిధ పార్టీల నేతలతో పాటు ప్రజా, విద్యార్ధి సంఘాల నాయకులు, కార్యకర్తలను ఇప్పటికే అరెస్టులు చేశారు పోలీసులు. మఫ్టీలో ఉన్న పోలీసులు జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో వివిధ పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికుల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కార్మికులు తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని వారిని కూడా పోలీసులు అనుమతించక పోవడంతో ఉద్యోగాలకు, కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే వారు నానా అగచాట్లు పడుతున్నారు. రహదారులు మూసి వేసి, ట్రాఫిక్ మళ్లించడంతో కష్టాలు పడుతున్నామని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరి సర ప్ర...