అరుదైన కలయిక..అద్భుత వేడుక


వారిద్దరూ అద్భుతమైన నటులు. వారి నటన అమోఘం. వారు చిటికేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు సూసైడ్ చేసుకునేందుకు రెడీగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. తాము అనుకున్నది చేయడం వారిద్దరి నైజం. దేశంలో  టాప్ మోస్ట్ హీరోస్ గా చెలామణి అవుతున్నారు. వారెవ్వరో కాదు తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్, నేచురల్ స్టార్ కమల్ హాసన్. వీరిద్దరూ ఒకే వేదికపై కలిశారు. సౌత్ స్టార్ కమల్ హాసన్ బర్త్ డే ను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వీరిద్దరికి సినిమా అవకాశాలను ఇచ్చి, గొప్ప నటులుగా తీర్చి దిద్దిన ఘనత ప్రముఖ దర్శకుడు బాలచందర్ దే. ఆయన భౌతికంగా లేక పోయినా, వీరిద్దరూ ఆయనను నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు.

రజనీ కాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన పేరు రజనీకాంత్ గా మార్చింది మాత్రం బాలచందర్. ఇక అప్పటి నుంచి నేటి దాకా ఆయన తన హవాను కొనసాగిస్తున్నారు. ఇక కమల్ హాసన్ కు దేశ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చిన సినిమా మరో చరిత్ర. దానిని అన్ని భాషల్లోకి రిలీజ్ చేశారు. దీనిని హిందీలో ఏక్ దూజే కేలియే పేరుతో బాలచందర్ తీసిన సినిమా ఇండియాను షేక్ చేసింది. అందులో కమల్ హాసన్ నటన అమోఘం. అద్భుతం. ఇప్పటికీ ఎవరు గ్రీన్ సినిమాగా నిలిచి పోయింది. తమ గురువు జ్ఞాపకార్థం కమల్ బాలచందర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో వీరిద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడారు.

నాకు నీడగా నిలిచిన బాలచందర్‌ గారికి నా కార్యాలయంలో విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన లేని లోటు భర్తీ చేయ లేనిది. రజనీ, నేను ఒకరు చేసే పనులకు మరొకరం అభిమానులం అని ఉద్ఘటించారు. అలాగే తనకు నచ్చిన ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ మూవీస్‌లో ‘గాడ్‌ఫాదర్, తిరువిళైయాడల్‌ , హే రామ్‌’ అని రజనీ కాంత్ కమల్ గురించి చెప్పారు. హే రామ్‌ చిత్రాన్ని దాదాపు 30 సార్లు చూసి ఉంటానని రజనీ పేర్కొనడం విశేషం. రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ పేరుతో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు కమల్‌. ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఏడాది గోల్డెన్‌ జూబ్లీ ఐకాన్‌గా రజనీకాంత్‌ను ఎంపిక చేశారని తెలియగానే ఫోన్‌ చేసి అభినందించాను.

యాక్టింగ్‌ మొదలుపెట్టిన తొలి ఏడాదే రజనీ ఐకాన్‌గా నిలిచారని చెప్పారు కమల్ హాసన్. ఈ గౌరవం రజనీకి 43  ఏళ్ల తర్వాత దక్కిందనే చెప్పుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ సినీ కెరీర్‌లో ముందుకు వెళ్లాలని మేం యువ హీరోలుగా ఉన్న రోజుల్లోనే నిర్ణయించుకున్నాం. ఓ సందర్భంలో సినిమాలు వదిలేస్తానని రజని నాతో చెప్పాడు. కానీ నేనే వద్దన్నా అని చెప్పాడు కమల్ హాసన్. మా వ్యక్తిగత విషయాలను రజనీ, నేను ఏ స్థాయిలో చర్చించు కుంటామో చెబితే అభిమానులు షాక్‌ అవుతారు అన్నారు కమల్‌ హాసన్‌. మొత్తం మీద ఇద్దరు దిగ్గజాలు ఒకే వేదికను పంచు కోవడం ఇప్పుడు తమిళ నాట వైరల్ గా మారింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!