ఉద్యోగం కంటే వీఆర్‌ఎస్ బెటర్
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం మెలమెల్లగా ప్రభుత్వ అధీనంలో ఉన్న కంపెనీలను ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే పనిలో పడ్డది. తాజాగా ఎన్నో ఏళ్లుగా ప్రజలకు విశిష్టమైన రీతిలో సేవలు అందించిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ కంపెనీని ఎంటీఎన్ఎల్ కంపెనీతో కలిపేసింది. రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే. వీటిని ప్రైవేట్ పరం కాకుండా ఉండేందుకు గాను ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి వారి సర్వీసెస్ ఆధారంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. దీంతో సర్కార్ నిర్ణయానికి ఊహించని రీతిలో భారీగా స్పందన లభించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఏకంగా 60000 మందికి పైగా దాటింది.
టెలికం సెక్రటరీ అన్‌షూ ప్రకాశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్ విషయంలో గడచిన కొద్ది రోజుల్లో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగుల సంఖ్య 57,000కు పైగా ఉందన్నారు. ఇక ఎంటీఎన్‌ఎల్ కంపెనీకి సంబంధించి సంఖ్యను కూడా కలుపుకుంటే దాదాపు 60,000 కు పైగా దాటే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఒక్క రోజుకే వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి సంఖ్య 40,000 నుంచి 57,000కు చేరిందని సమాచారం. వీఆర్‌ఎస్ పథకానికి స్పందన అసాధారణం అని ఆయన పేర్కొన్నారు. 94,000 మందికి వీఆర్‌ఎస్ ఇవ్వాలని తమ ప్రభుత్వం టార్గెట్ప్ర గా పెట్టుకుందన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ పీకే పుర్వార్ మాట్లాడుతూ సంస్థలో వీఆర్‌ఎస్ కింద ఇప్పటికి 40,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇందులో 26,000 మంది గ్రూప్ ‘సీ’కి చెందిన వారున్నారు. అన్ని కేడర్ల నుంచీ పథకానికి స్పందన బాగుందన్నారు. ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుందన్నారు. సంస్థలో దాదాపు 1.50 లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో లక్ష మంది వీఆర్‌ఎస్ ప్రయోజనం పొందేందుకు అర్హులుగా ఉన్నారు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచు కుంటారని, దీని వల్ల దాదాపు 7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తోంది.
కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. నష్టాలు, రుణ భారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించడం తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్‌ఎల్ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. కాగా రెండు కంపెనీల రుణ భారం 40,000 కోట్ల పైగా ఉంది. మొత్తం మీద ఉద్యోగుల భారం తగ్గించుకుని, ఉన్న ఆస్తులను అమ్మాలన్నది ప్రభుత్వ హిడెన్ ఎజెండాగా ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి