టీఎస్ సర్కారుకు కోర్టు ఝలక్
ఆర్టీసీ సమ్మె పై తీర్పు ఓ కొలిక్కి వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది. 5100 బస్సులకు పర్మిట్లు ఇచ్చే విషయంపై స్టేటస్ కో ఇచ్చింది. ఈ సందర్బంగా ప్రముఖ ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. రూట్స్ ను ప్రైవేట్ చేసే ఆలోచన విరమించు కోవాలని సూచించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 14 వ సారి ఆర్టీసీపై సమీక్ష చేపట్టారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 35 రోజులకు చేరుకుంది.
ప్రభుత్వం, ఆర్టీసీ తో పాటు జేఏసీ చర్చలు జరపాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం లేనట్టు కనపడుతోందని చీఫ్ జస్టిస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సర్కార్ కు మరో షాక్ తగిలింది. కార్మికులకు సంబంధించి వాడుకున్న 768 .5 కోట్లు వెంటనే జమ చేయాలని షోకాజ్ నోటిస్ జారీ చేసింది. అయితే ఆర్టీసీ జేఏసీ సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చింది. ఈ దీక్షకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని సీపీ తెలిపారు. అన్ని విపక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి.
శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అందుకే అన్ని చోట్లా అరెస్టులు చేస్తున్నామని అంటున్నారు పోలీసులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కొందరు నేతలు ఇప్పటికే అరెస్ట్ కాగా మరికొందరు అజ్ఞాతం లోకి వెళ్లి పోయారు. ఎన్ని నిర్బంధాలు విధించినా, అరెస్టులు చేసినా సరే తమ సమ్మె మాత్రం ఆగదంటున్నారు కార్మికులు. ఎట్టి పరిస్థితుల్లో సకల జనుల దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి