కంపెనీలతో టై అప్..ప్రాఫిట్ లో టాప్


స్టార్ట్ అప్ లు, కంపెనీలకు మరింత ఆదాయం సమకూరేలా అమెరికా ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ సపోర్ట్ చేస్తోంది. దీంతో ఆయా కంపెనీలు తయారు చేసిన డిఫ్ఫరెంట్ ప్రోడక్ట్స్ కు మంచి డిమాండ్ ఉంటోంది. తాజాగా అమెజాన్‌ తన పోర్టల్‌లో కళా హాత్‌ పేరుతో ఓ స్టోర్ ను నిర్వహిస్తోంది. ఇందులో 280 రకాల కళా రూపాల తాలూకు ఉత్పత్తులు ఇప్పటికే నమోదు అయ్యాయి. 2020 చివరి నాటికి 500 రకాల కళా రూపాలను ఈ–కామర్స్‌ పోర్టల్‌లో పరిచయం చేయాలని ప్రయాన్ టార్గెట్ గా పెట్టుకుంది. కాటమరాన్‌ వెంచర్స్, అమెజాన్‌ల సంయుక్త కంపెనీ అయిన ప్రయాన్‌ దీనిని ప్రమోట్‌ చేస్తోంది.

సాధారణంగా విక్రేతల నుంచి అమెజాన్‌ 16 శాతం కమిషన్‌ తీసుకుంటుంది. కళా హాత్‌ కింద నమోదైన విక్రేతలకు ఇది 8 శాతమే. ప్రతి క్లస్టర్‌లో కంపనీ ప్రతినిధి ఒకరు నిరంతరం ఉండి వారి వ్యాపార వృద్ధికి తోడ్పాటు అందిస్తారు. శిక్షణ కూడా ఇస్తోంది ప్రయాన్. చేనేత, హస్త కళాకారులకు స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. వారి ఉత్పత్తుల లిస్టింగ్, 3డీ మోడలింగ్‌ ప్రక్రియ అంతా కంపెనీ చూసుకుంటోంది. పోచంపల్లి ఇక్కత్, మంగళగిరి, కళంకారీ, పశీ్మనా, మధుబని, రోగన్, లిప్పన్‌ కామ్, ధరీజ్‌ వంటి సంప్రదాయ చేనేత వ్రస్తాలన్నీ దీన్లో వున్నాయి.

ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  5,000 పైచిలుకు సంఘాలు, మాస్టర్‌ వీవర్స్, గోల్కొండ, లేపాక్షి వంటి సంస్థలతో చేతులు కలిపింది. కళా హాత్‌ కింద నమోదైన చేనేత, హస్త కళాకారులకు ఒక్కొక్కరికి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం 10,000ల నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. ఇటువంటి విధానం అమలుకు ఆంధ్రప్రదేశ్, జమ్మూ,కాశ్మీర్, తమిళనాడు ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని కంపెనీ ఎండీ సందీప్‌ వెల్లడించారు.  తెలంగాణ నుంచి 180, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 150 మంది కళాకారులు ప్రస్తుతం కళా హాత్‌ కింద నమోదు అయినట్లు తెలిపారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!