ఉద్దవ్ సెన్సేషన్ కామెంట్స్
మరాఠాలో రాజకీయం హీటెక్కింది. అది ఎంత దాకా అంటే నువ్వెంత అనే దాకా వెళ్ళింది. ఏకంగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే బీజేపీపై సంచలన కామెంట్స్ చేశారు. ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపై థాక్రే మండి పడ్డారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధా లేనని, తనను దిగ్భ్రాంతి కలిగించాయని అన్నారు. 50-50 ఫార్ములాపై చర్చల్లో ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారని ఉద్ధవ్ వెల్లడించారు. బీజేపేనే తమ ముందు మోకరిల్లాలి కానీ, శివసేన వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఇరు పార్టీల మధ్య బంధం బలపడాలని కోరారని, నాటి చర్చల్లో స్వయంగా అమిత్‌షా వెంట ఫడ్నవిస్ కూడా ఉన్నారని చెప్పారు. అబద్ధాలు, నిందలతో తమపై ఆరోపణలు గుప్పించడం బాధాకరమని అన్నారు.
అబద్ధాలు ఎవరు చెబుతున్నారో మహారాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. ప్రధాని మోదీపై తాము చేసినన్ని ఆరోపణలను కాంగ్రెస్ కూడా చేయలేదని ఫడ్నవిస్ చెప్పడం కూడా అబద్ధమేనని అన్నారు. మోదీపై కానీ, అమిత్‌షాపై కానీ తామెప్పుడూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ లేదని ఉద్ధవ్ చెప్పారు. బీజేపీ ఇంత దిగజారుడుకు పాల్పడు తుందని అనుకోలేదన్నారు. ఆర్ఎస్ఎస్‌పై తమకు ఎంతో గౌరవం ఉందని, అబద్ధాలు ఎవరు చెప్పారో ఆర్ఎస్ఎస్ తేల్చు కోవాలన్నారు. రాముడు పేరు చెబుతూ అబద్ధాలు మాట్లాడటం బీజేపీకే చెల్లిందన్నారు.
బీజేపీ తనను అబద్ధాలకోరు అంటోందని, ఆ అబద్ధాలు ఏమిటో నిరూపించగలరా అని సవాలు విసిరారు. మహారాష్ట్ర ప్రజలు థాకరేలను నమ్మారని, అమిత్‌షా, ఆయన పరివారాన్ని కాదని కూడా ఆయన కుండబద్ధలు కొట్టారు. ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో బీజేపీనే ప్రజలకు సమాధానం చెప్పాలని ఉద్ధవ్ అన్నారు. మెజారిటి నిరూపించు కోవాలని కూడా సవాలు చేశారు. మహారాష్ట్రకు శివసేన సీఎంను అందిస్తానని బాలా సాహెబ్‌కు ప్రామిస్ చేశానని, ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు మూసుకు పోలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఉద్ధవ్ చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి