గాంధీ ఫ్యామిలీకి కేంద్రం షాక్
భారత దేశంలో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నేషనల్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చే పనిలో పడ్డది కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వం. ప్రజల్లో తమదైన ముద్ర వేసుకున్న గాంధీ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రస్తుతం కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ను ఉపసంహరించు కోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తోన్న కేంద్రం ఎస్పీజీని తొలగించి జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఎస్పీజీ భద్రతను కేవలం రాష్ట్రపతి, దేశ ప్రధానికి మాత్రమే కేటాయిస్తారని, ఇతర నేతలకు అవసరం లేదని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎస్పీజీ చట్టానికి సవరణ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దాని కోసం త్వరలోనే పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. విపక్షాలపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా మాజీ ప్రధాని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కూడా ఇటీవల ఎస్పీజీ భద్రతను కేంద్రం ఉపసంహరించుకున్న విషయ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు జెడ్‌ప్లస్ భద్రతను కల్పిస్తున్నారు. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు కాకుండా చేయాలని డిసైడ్ అయ్యింది బీజేపీ. ఆ దిశగా పావులు కదుపుతోంది. అయితే భద్రత తొలగింపు వ్యవహారం పై రాహుల్ గాంధీ ఇంకా స్పందించ లేదు. కాంగ్రెస్ పార్టీ వర్గాలు మౌనంగా ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి