ఏపీలో రాజు ఎవ్వరో..పీఠం దక్కేదెవరికో -బాబు నిలిచేనా..జగన్ గెలిచేనా..పవన్ కు దక్కేనా - వెల్లడించనున్న మిషన్ చాణక్య

దేశ మంతటా ఓ వైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటే..సరిహద్దులో కాల్పుల మోత మోగుతుంటే..మరో వైపు ఎండ వేడిమి కంటే ఎక్కువగా ఎన్నికల వాతావరణం అగ్గి కంటే ఎక్కువ మండుతోంది. బీజేపీ సర్కార్ మరోసారి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ కూడా తనకు ఎదురే లేకుండా చేయాలని అనుకుంటోంది. ఇందు కోసం అమిత్ షా చాప కింద నీరులా తన ప్లాన్‌ను వర్కవుట్ చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. నిన్నటి దాకా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన టీడీపీ..బీజేపీలు ఇపుడు ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపెడుతున్నారు. దేశ రాజకీయాలు మరింత రంజుగా మారాయి. ఎవరు ఎటు వైపు వెళుతున్నారో తెలియడం లేదు. బిజేపియేతర పార్టీలనన్నింటిని ఒకే తాటిపైకి తీసుకురావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో ఏపీలో ఎన్నికల బాజా మోగనుంది. ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. లెక్కకు మించి సర్వేలు చేయించారు. మరో వైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నారు. జనం కోసం పాదయాత్రలు చేపట్టారు. ప్రతిపక్ష న...