ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా గీతా గోపినాథ్ ..!
అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతమైన సంస్థగా పేరొందిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రధాన ఆర్థికవేత్తగా ఇండియాకు చెందిన గీతా గోపినాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఐఎంఎఫ్‌కు భారత్ తరపున ఓ మహిళ ఆర్థికవేత్త ప్రధాన పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి. ఆర్థిక రంగంలో ఆమెకు అపారమైన అనుభవం ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికపరమైన వ్యవహారాలలో ఎంతో ప్రభావితం చూపే ఐఎంఎఫ్ సంస్థకు ఓ మహిళ పగ్గాలు చేపట్టడం మహిళా సాధికారతకు నిదర్శనం. ఈ దేశపు మహిళలందరికి లభించిన అరుదైన గౌరవంగా భావించాల్సి ఉంటుంది. గీతా గోపినాథ్‌ది పశ్చిమ బెంగాల్. 8 డిసెంబర్ 1971లో కోల్‌కత్తాలో జన్మించారు. ఇండియన్ అమెరికన్ ఆర్థికవేత్తగా ఉన్నారు. ప్రపంచంలో ఉన్నతమైన యూనివర్శిటీగా పేరొందిన హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్ విభాగానికి ప్రొఫెసర్‌గా ..హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మాక్రో ఎకనమిక్స్ ప్రోగ్రాం, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రిసెర్చ్ కు కో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కేరళ రాష్ట ప్రభుత్వ ముఖ్యమంత్రికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా గీతా గోపినాథ్ పనిచేశారు. ఆర్థిక రంగంలో ఆమెకున్న అపారమైన అనుభవం దృష్ట్యా ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గా పరిగణలోకి తీసుకుంది. ఈ విషయాన్ని 2018లోనే ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్థిక రంగం..సూక్ష్మ ఆర్థిక వ్యవస్థపై గీతా గోపినాథ్ ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను ఆమె పరిశీలించారు. వేలాదిగా పరిశోధనాత్మక పత్రాలను సమర్పించారు. ఎన్నో కథనాలు ప్రచురించారు. జర్నల్స్ కూడా పేరొందాయి. మైసూర్‌లోని నిర్మల క్వానెంట్ స్కూల్‌లో చదివారు. ఢిల్లీలోని లేడి శ్రీరాం కాలేజ్ లో డిగ్రీ చదివారు. యూనివర్శిటీ వాషింగ్టన్‌లో ఎంఏ పూర్తి చేశారు. ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో పీహెచ్‌డి పట్టా పొందారు. ఇదే యూనివర్శిటీలో ప్రిన్స్‌టన్ ఉడ్రో విల్సన్ ఫెలోషిప్ రీసెర్చ్ అవార్డు పొందారు.
బోస్టన్‌లోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ లో విజిటింగ్ స్కాలర్‌గా ఉన్నారు. న్యూయార్క్‌లోని ఎఫ్ ఆర్ బి ఎకనమిక్ అడ్వయిజరీ ప్యానల్ మెంబర్‌గా ఉన్నారు. అమెరికన్ ఎకనమిక్ రివ్వ్యూ సహ - సంపాదకురాలిగా వ్యవహరించారు. కరెంట్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ తో పాటు రివ్యూ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ కు ఆర్థిక కౌన్సెలెర్‌గా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ అల్యూమ్‌నస్ అవార్డు పొందారు. 2014లో ఐఎంఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా 45 ఏళ్ల లోపు అత్యున్నతమైన ఆర్థిక వేత్తలుగా 25 మందిని ఎంపిక చేసింది. అందులో గీతా గోపినాథ్ కూడా ఒకరు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 2011లో యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికైంది.
ఆమె భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్ అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. గీతా గోపినాథ్ అంచెలంచెలుగా ..అత్యున్నతమైన పదవిని అందుకున్నారు. ప్రపంచాన్ని ఆర్థిక రంగం శాసిస్తోంది. ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలన్నా..సామాజికంగా ఉన్నత స్థానంలో ఉండాలన్నా ఆర్థిక పరంగా ఉన్నత స్థానంలో ఉండాల్సిందే. ప్రస్తుతం ఆపత్కర ..విపత్కర పరిస్థితులు ఆర్థిక రంగాన్ని చుట్టుముట్టాయి. ఈ తరుణంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఐఎంఎఫ్‌కు ప్రవాస భారతీయురాలు ఎంపిక కావడం ఇండియాకు లభించిన పురస్కారమనే అనుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్న ఈ సమయంలో గీతా గోపినాథ్ ప్రపంచ స్థాయి పదవిని చేపట్టడం మనందరికీ గర్వకారణం కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి