ఏపీలో రాజు ఎవ్వరో..పీఠం దక్కేదెవరికో -బాబు నిలిచేనా..జగన్ గెలిచేనా..పవన్ కు దక్కేనా - వెల్లడించనున్న మిషన్ చాణక్య
దేశ మంతటా ఓ వైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటే..సరిహద్దులో కాల్పుల మోత మోగుతుంటే..మరో వైపు ఎండ వేడిమి కంటే ఎక్కువగా ఎన్నికల వాతావరణం అగ్గి కంటే ఎక్కువ మండుతోంది. బీజేపీ సర్కార్ మరోసారి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ కూడా తనకు ఎదురే లేకుండా చేయాలని అనుకుంటోంది. ఇందు కోసం అమిత్ షా చాప కింద నీరులా తన ప్లాన్‌ను వర్కవుట్ చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. నిన్నటి దాకా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన టీడీపీ..బీజేపీలు ఇపుడు ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపెడుతున్నారు. దేశ రాజకీయాలు మరింత రంజుగా మారాయి.
ఎవరు ఎటు వైపు వెళుతున్నారో తెలియడం లేదు. బిజేపియేతర పార్టీలనన్నింటిని ఒకే తాటిపైకి తీసుకురావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో ఏపీలో ఎన్నికల బాజా మోగనుంది. ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. లెక్కకు మించి సర్వేలు చేయించారు. మరో వైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నారు. జనం కోసం పాదయాత్రలు చేపట్టారు. ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా..పకడ్బందీగా సోషల్ మీడియాను వాడుకునేలా అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అధికార పీఠం ఎక్కాలని జగన్ ట్రై చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు, దోపిడీకి కేరాఫ్‌గా ఏపీ మారిందని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా డేటా చోర్యానికి పాల్పడ్డారంటూ గవర్నర్‌ను కలిసి ఆరోపించారు. ఇంకో వైపు జనసేన అధిపతి ..నటుడు పవన్ కళ్యాణ్ ఏపీని టార్గెట్ చేశారు. అంతిమంగా సీఎం కుర్చీ నాదేనంటున్నారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం తాను ఎనలేని కృషి చేశానని..ఈసారి అభివృద్ధి మంత్రం పనిచేస్తుందని చంద్రబాబు ధీమాతో ఉన్నారు. పాదయాత్రలు, చిన్నజీయర్ స్వామీజీ దీవెనలు , వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనను సీఎంగా నిలబెడతాయని గంపెడాశతో జగన్ ఉన్నారు. ఎవరు రంగంలో ఉన్నా ఏపీలో ఈసారి జరిగే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని..దానిని ఆపే శక్తి ఏ ఒక్కరికి లేదని అంటున్నారు పవర్ స్టార్.
రివర్స్ గిఫ్ట్ ఇస్తానని ఢంకా భజాయించి సవాల్ విసిరిన కేసీఆర్ తన మార్క్ రాజకీయాన్ని స్టార్ట్ చేశారు. ఏపీలో ఇటీవల పర్యటించారు. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడంతో మరింత దూకుడును పెంచారు గులాబీ బాస్. జగన్‌ను కేటీఆర్ కలిశారు. ఏపీలో కాబోయే సీఎం జగనే అంటూ ప్రకటించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జగన్‌కు సపోర్ట్‌గా కేసీఆర్‌తో కలిసి ఏపీలో ప్రచారం చేస్తానని డిక్లేర్ చేశారు. కుల సమీకరణాలతో పాటు చేసిన అభివృద్ధి పనులు తెలుగుదేశం పార్టీని అందలం ఎక్కిస్తాయని నమ్మకంతో ఉన్నారు బాబు.
సీనియర్ జర్నలిస్ట్ శివకేశవ్ ఆధ్వర్యంలో ని మిషన్ చాణక్య సంస్థ ఇప్పటికే తనకంటూ స్వంత బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఫలితాలను ప్రకటించడం..సర్వే చేపట్టడం..ఓటర్ల నాడి ఎలా వుందో తెలుసు కోవడం తో పాటు పూర్తి పారదర్శకతతో పని చేయడం ఈ సంస్థ లక్ష్యం.
సీనియర్ జర్నలిస్ట్ శివకేశవ్ ఆధ్వర్యంలో ని మిషన్ చాణక్య సంస్థ ఇప్పటికే తనకంటూ స్వంత బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఫలితాలను ప్రకటించడం..సర్వే చేపట్టడం..ఓటర్ల నాడి ఎలా వుందో తెలుసు కోవడం తో పాటు పూర్తి పారదర్శకతతో పని చేయడం ఈ సంస్థ లక్ష్యం.
అనుభవజ్ఞులైన వ్యక్తులు, జర్నలిస్టులు ..మేధావులు..అనలిస్టులు ..ఇతర సిబ్బంది ..పూర్తిగా సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో మిషన్ చాణక్య సర్వే చేపట్టింది. దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన ఈ ఎన్నికల్లో అన్ని ఛానల్స్, పత్రికలు, సామాజిక మాధ్యమాలు స్పష్టం చేసిన ప్రీ పోల్ సర్వేలు, వెల్లడించిన ఫలితాలు సరాసరి దగ్గరకు కూడా రాలేక పోయాయి. కానీ హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ ఢంకా భజాయించి ముందే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో వెల్లడించింది. దీంతో మిగతా ప్రచురణ, ప్రసార మాధ్యమాలన్నీ మిషన్ చాణక్య సంస్థ చేపట్టే సర్వే వైపు చూడటం ప్రారంభించాయి. కర్ణాటక ఫలితాలు బీజేపీకి లాభం కలిగించేవిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కలిస్తే పవర్‌లోకి రావడం కష్టమేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ, ఏపీ బీజేపీ నాయకులు అంగీకరించారు కూడా.
ప్రతి నియోజకవర్గంలో పర్యటించడం, అన్ని వర్గాల ప్రజలను కలవడం, వారి మనోభావాలను పరిగణలోకి తీసుకోవడం, వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఓటరు నాడి తెలుసుకోవడం..ఫలితాలను అంచనా వేస్తోంది..ఈ సంస్థ. కొన్నేళ్ల పాటు బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఈ సంస్థ సిఇఓ శివ కేశవ్‌కు ఉన్నది. ఈ అనుభవమే సంస్థకు ఉపయోగకారిగా ఉంటూ వస్తున్నది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పవర్‌లోకి రాబోతుందని..ఏయే నియోజకవర్గాలలో గులాబీ జెండా ఎగరనుందో ఆధారాలతో..అంకెలతో స్పష్టం చేసింది. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల ఐక్యతా రాగం పనిచేయదని..రైతులు గంప గుత్తగా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని..పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉద్యోగుల భద్రత..అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ..కేసీఆర్‌ను తెలంగాణ ప్రాంతానికి రాజును చేయబోతున్నాయని మిషన్ చాణక్య స్పష్టం చేసింది. 86 సీట్లు ఖాయమని ..ఆ పార్టీకి ఎదురే లేకుండా పోతోందని..రెండు సంఖ్యల డిజిట్‌కే ప్రతిపక్షాలు పరిమితం కాబోతున్నాయని..ఏ స్థాయిలోను టీఆర్ ఎస్‌కు పోటీ ఇవ్వలేక చతికిల పడనున్నాయని హెచ్చరించినా వినిపించు కోలేదు.
అన్ని వర్గాల ప్రజలు, కులాలు ..రైతులు గులాబీనే నమ్ముకున్నారని ఇక ప్రమాణ స్వీకారం చేయడం మాత్రమే మిగిలి ఉందని స్పష్టం చేసిందీ ఈ సంస్థ. పార్లమెంట్ కు ఇటు ఏపీలో అసెంబ్లీ కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రమంతటా మిషన్ చాణక్య సంస్థ సభ్యులు బృందాలుగా ఏర్పడి అన్ని నియోజకవర్గాలలో పర్యటించారు. ప్రజల మనోభావాలను..ఓటర్ల నాడిని తెలుసుకున్నారు. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయి. పోయిన సారి ఎన్నికల్లో 2 శాతం ఓటర్లు ప్రభావితం చూపించగా..ఈసారి క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం చేకూరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా చూస్తే పవర్‌లోకి రావాలంటే ఒక్క శాతం ఓటర్లే కీలక భూమిక పోషించబోతున్నారు. ఈ శాతమే ఏ పార్టీ వైపు ఉండబోతుందో అదే అధికారాన్ని చేజిక్కించుకోనుందని అంచనా. సమయం ఉండడంతో ఇప్పటి నుంచే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు ప్రణాళికాబద్దంగా ప్రయత్నాలు చేస్తే పవర్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇరు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ప్రీపోల్ సర్వే లో అంచనాలు వాస్తవ రూపం దాల్చడంతో మిషన్ చాణక్య సంస్థ ప్రకటించబోయే..వెల్లడించబోయే వివరాల కోసం ప్రచురణ, ప్రసార, సామాజిక, డిజిటల్ మాధ్యమాలు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ప్రవాస భారతీయులు కూడా ఈ వివరాల కోసం వేచి చూస్తున్నారు. ప్యాకేజీల కోసం కాకుండా ప్రజల కోసం స్వచ్ఛందగా చేస్తున్న ఈ సంస్థ వెల్లడించే సర్వే వివరాలు ఎవరి వైపు మొగ్గు చూపనున్నాయి. ఏ మేరకు ఏ అంశాలు ప్రభావితం చూపబోతున్నాయి. చంద్రబాబు మ్యాజిక్ పనిచేస్తుందా లేక జగన్ వ్యూహం ఫలిస్తుందా..పవర్ స్టార్ మేనియా గట్టెక్కిస్తుందా అన్నది..త్వరలో సిఇఓ శివ కేశవ్ వివరాలు వెల్లడించనున్నారు. త్వరలో సంస్థ ఏం వెల్లడిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. తెలుసుకోవాలంటే..కొంత సేపు ఆగాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి