తెలంగాణలో తీన్మార్..టీఆర్ఎస్ జోర్దార్

ఎవరైనా ఓటమిని తేలిగ్గా తీసుకుంటారు. ఇంకొందరు నాయకులు అసలు అపజయాన్ని ఒప్పుకోరు. విజయం సాధించే దాకా నిద్రపోరు. భారతదేశంలో అలాంటి కోవకు చెందిన అగ్రనేతల్లో వేళ్ల మీద లెక్కించే వారు మాత్రమే ఉన్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర దళపతి కేసీఆర్ ఒకరు. డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి నేడు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేంత దాకా..అడుగులన్నీ గెలుపు వైపే. ఓటమి రుచించదు. సక్సెస్‌లోని మజాను కేసీఆర్ ఆస్వాదించినంతగా ఇంకెవ్వరూ ఆస్వాదించలేరు. పక్కా ప్రణాళిక, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశనం చేయడం. దగ్గరుండి బాధ్యతలు అప్పగించడం. సీనియర్లను పురమాయించడం. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు మానిటరింగ్ చేయడం. డిజిటల్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాలను వాడుకోవడం. ఆయనకు తెలిసినంతగా ఇంకే నేతకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా జరిగిన సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీకి మింగుడుపడని రీతిలో ఫలితాలు వచ్చాయి. ప్రజా తీర్పును గౌరవిస్తామంటూనే..ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ సత్తా ఏమిటో రుచి చూపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పోయ...