యుఎస్ మిలియ‌నీయ‌ర్స్ ల‌లో మ‌నోళ్లే టాప్


ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అన్న నానుడిని ఎన్ఆర్ఐ మ‌హిళ‌లు నిజం చేస్తున్నారు. ఒక‌ప్పుడు ఇంటికే ప‌రిమిత‌మైన నారీమ‌ణులు ఇపుడు ప్ర‌పంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. అన్ని రంగాల‌లో త‌మ‌దైన ముద్ర‌ను క‌న‌బ‌రుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డంలో వీరు పురుషుల‌కంటే ముందంజ‌లో ఉంటున్నారు. ముఖ్యంగా భార‌తీయ మ‌హిళ‌ల‌తో పాటు ప్ర‌వాస భార‌తీయ మ‌హిళ‌లు సైతం త‌మ‌కు సాటిరారెవ్వ‌రంటూ స‌వాల్ విసురుతున్నారు. ప్ర‌తి ఏటా అమెరికాలో ఎంత‌మంది ధ‌న‌వంతులు వున్నార‌నే దానిపై ఓ జాబితా రూపొందుతుంది. తాజాగా ప్ర‌క‌టించిన మిలియ‌నీర్ల‌లో యుఎస్ కోటీశ్వ‌రుల్లో మ‌న‌వాళ్ల‌కు చోటు సంపాదించారు. 

అమెరికా టాప్ 80 మ‌హిళా ధ‌న‌వంతుల జాబితాలో స్థానం పొంద‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. యుఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ వుమెన్ -2019 పేరుతో ఫోర్బ్స్ విడుద‌ల చేసిన లిస్టులో అరిస్టా నెట్ వ‌ర్క్ ప్రెసిడెంట్, సిఇఓ జ‌య‌శ్రీ ఉల్లాల్, ఐటీ క‌న్స‌ల్టెన్సీ , అవుట్ సోర్సింగ్ కంపెనీ సింటెల్ కో ఫౌండ‌ర్ నీరజా సేథి, స్ట్రీమింగ్ డేటా కంపెనీ కాన్ ఫ్లుయెంట్ సిటిఓ, కో ఫౌండ‌ర్ నేహాలు జాబితాలోకి ఎక్కేశారు. అమెరికాలోని అతి పెద్ద పైక‌ప్పులు, గోడ‌లు, కిటికీల హోల్ సేల్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ఏబీసీ స‌ప్లై ఛైర్ ప‌ర్స‌న్ డ‌య‌నా హెండ్రిక్స్ టాప్ వ‌న్‌లో నిలిచారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ 700 కోట్ల డాల‌ర్లు. 58 ఏళ్ల జ‌య‌శ్రీ ఉల్లాల్ సుమారు 9713 కోట్ల‌తో 18 వ‌స్థానంలో ఉన్నారు. 

అరిస్ఆ స్టాకుల్లో 5 శాతం వాటా వుంది. లండ‌న్‌లో పుట్టిన ఆమె ..ఇండియాలో పెరిగింది. ఇపుడు యుఎస్ మ‌హిళా కోటీశ్వ‌రుల్లో ఒక‌రుగా నిలిచి చ‌రిత్ర సృష్టించింది. 6 వేల 937 కోట్ల సంప‌ద‌తో 64 ఏళ్ల నీర‌జా సేథి 23వ స్థానాన్ని ద‌క్కించుకుంది. 1980లో త‌న భ‌ర్త భ‌ర‌త్ దేశాయ్‌తో క‌లిసి ల‌క్షా 38 వేల‌తో సింటెల్ సంస్థ‌ను స్థాపించారు. మిషిగ‌న్ న‌గ‌రంలోని ట్రాయ్ అనే ఓ అపార్ట్‌మెంట్‌లో చిన్న‌గా మొద‌లైన ఆ సంస్థ ప్ర‌స్థానం కొద్ది కాలంలోనే ప‌తాక స్థాయికి చేరుకుంది. సింటెల్‌ను ఫ్రాన్స్‌కు చెందిన అటోస్ ఎస్ఇ కొనుగోలు చేసింది. భారీ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. 

ఆమె వాటా కింద 51 కోట్ల డాల‌ర్లు వ‌చ్చాయి. నేహా న‌ర్జ‌డే చిన్న వ‌య‌సులోనే కోటీశ్వ‌రుల‌య్యారు. ఆమె సంప‌ద సుమారు 2 వేల 500 కోట్లు. ఈ జాబితాలో 60వ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. ఆమె కంపెనీ కాన్ ఫ్లుయెంట్ విలువ 17 వేల 373 కోట్లు. ఈ కంపెనీకి నెట్ ఫ్లిక్స్, ఊబెర్, గోల్డ్‌మెన్ సాక్స్ క‌స్ట‌మ‌ర్లుగా ఉన్నాయి. లింక్డిన్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేసిన ఆమె పెద్ద మొత్తంలో వ‌చ్చి ప‌డుతున్న డేటాను నిర్వ‌హించేందుకు అపాచీ క‌ఫ్కా అనే సాఫ్ట్ వేర్‌ను డెవ‌ల‌ప్ చేశారు. 2014లో త‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రితో క‌లిసి కాన్ ఫ్లుయెంట్‌ను స్థాపించారు. 

కామెంట్‌లు