బాలీవుడ్‌లో టాప్ 5 సినిమాలు ఇవే..!

సినిమా ఇండస్ట్రీ అనే సరికల్లా ఇండియాలో ఠక్కున గుర్తుకు వచ్చేది బాలీవుడ్ తర్వాతే ఏదైనా . ఇప్పటి దాకా వేలాది సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. కొన్ని సాధారణ సక్సెస్ అవుతే, మరికొన్ని బాక్సాఫీస్‌లు బద్దలు కొట్టాయి. కొన్ని మూవీస్ రికార్డులు బ్రేక్‌లు చేస్తే..మరికొన్ని కోట్లాది రూపాయలు కొల్లగొట్టాయి. ఇంకొన్ని అయితే డాలర్లు కొల్లగొడుతున్నాయి. ఎన్ని సినిమాలు వచ్చినా..వస్తూనే వున్నా ..కొన్ని మాత్రం ఎల్లకాలం పాటు అలాగే వుంటాయి. మన గుండెల్ని తడుముతూనే ఉంటాయి. అలాంటి వాటిలో జనాన్ని సమ్మోహితులను చేసి..థియేటర్లకు ప్రేక్షకులను రప్పించిన సినిమాలు వందలోపు వుండొచ్చని సినీ వర్గాల అంచనా. ఇండియా సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడిన వాళ్లు లక్షలాది మంది ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనినే నమ్ముకుని బతుకులు పారేసుకున్న వాళ్లు కూడా ఎందరో. వీరు లెక్కల్లోకి రారు. వారి చిరునామాలు మనకు దొరకవు. సినిమా అన్నది ఓ ఆల్కెమీ అంటాడు మిత్రుడు, రచయిత సిద్దారెడ్డి. నిజమేగా తను చెప్పింది. సినిమా తీయాలంటే ఒకప్పుడు సులభంగా వుండేది. టెక్నాలజీ పెరిగింది. మార్కెట్ శ...