ముద్దుల మురిపెం..సరస సల్లాపం ..!

జీవితం అన్నాక కాస్తంత రిలీఫ్ లేకపోతే..వుండీ అర్థం ఏముంటుందని..? ఓ ముద్దు ముచ్చట లేకపోతే శరీరం అలసటకు లోనవుతుంది. ఏదో కోల్పోయినంత బాధ కలుగుతుంది. లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్నంత కనెక్టివిటీ ఇంకే జీవరాశుల్లో లేదు. అందుకే ఇంతటి ఆకర్షణ. ఒకరిపై మరొకరి మమకారం. అన్నింటికంటే ఎక్కువగా అర్థం చేసుకోవడం. అతడు సినిమాలో మహేష్ బాబు..త్రిషల మధ్య పండిన కెమిస్ట్రీ ఎందరినో ఆకట్టుకునేలా..మళ్లీ మళ్లీ జ్ఞాపకం తెచ్చుకునేలా చేసింది. ఊహల్లో విహరించడం మనకు ఎక్కువగా అలవాటు. ఆ ఊహే ..ఆ ఆలోచనే లేక పోతే లైఫ్ బోర్ కొడుతుంది. ఈ ప్రయాణం వేస్ట్ అనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా..తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. తన కోసం వేచి చూడటం. సినిమా టాకీసుల వద్ద..బస్టాండ్..రైల్వే స్టేషన్ వద్ద నిలిచి వుండటం.. సాయంత్రమైతే బయటకు వస్తుందేమోనన్న ఆరాటం. ఇదంతా రక్త మాంసాలు కలిగిన స్పందించే హృదయం కోసం మరో మనసు పడే తపన..నిరీక్షణ. ఎవరికి వారు ..ఎవరి లోకంలో వాళ్లు నటిస్తున్నారంతే..చూస్తే అంతా ఒక్కరే..తరిచి చూస్తే ఒకరిలో ఎన్నో ముఖాలు..మరెన్నో ఈర్ష్...