‘చిప్కో’ను వరించిన ఇందిర అవార్డు

దేశంలో ప్రముఖ సామాజిక వేత్తగా, కార్యకర్తగా పేరొందిన, చిప్కో మూవ్ మెంట్ వ్యవస్థాపకుడు చండీ ప్రసాద్ భట్ కు అరుదైన బహుమతి లభించింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇందిరాగాంధీ అవార్డు వరించింది. ఆయనకు ఇప్పుడు 85 ఏళ్ళు. జాతీయ సమైక్యతను కాపాడటం, ప్రోత్సహించడంలో ప్రసాద్ చేసిన సేవలకు 2017–18 సంవత్సరానికి గాను ఇందిరా గాంధీ 31వ అవార్డు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జ్ఞాపకార్థం ఈ అవార్డును కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఇందిరా గాంధీ వర్ధంతి రోజు అక్టోబర్ 31న ఢిల్లీలోని జవహార్ భవన్ లో జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 10 లక్షల రూపాయల నగదు, ప్రశంసా పత్రం అంద జేస్తారు. ఉత్తరాఖండ్ కు చెందిన భట్..1964లో గ్రామ స్వరాజ్య సంఘ్ ద్వారా చిప్కో మూవ్ మెంట్ ప్రారంభించారు. 1982లో కమ్యూనిటీ లీడర్షిప్ కు గాను ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది. అంతే కాకుండా 2013 లో గాంధీ శాంతి బహుమతిని భట్ అందుకున్నారు. 1934 లో ఆయన పుట్టారు. గాంధీయన్ మూవ్ మెంట్ ను ఆయన ముందుకు తీసుకు వెళుతున్నారు. 1964 లో గోపేశ్వర్ లో దశోలి గ్రామ స్వరా...