జస్టిస్ కోదండరాం కు సలాం
కాసింత అధికారం వుంటే చాలు కోట్లు వెనకేసుకోవడం షరా మాములుగా మారింది. ఎక్కడ చూసినా అవినీతి అనకొండలు కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తున్నారు. ఏసీబీ అధికారులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నారు. విస్తు పోయేలా నోట్ల కట్టలు, లెక్కించ లేనంతగా బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్లు దొరుకుతున్నవి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరాక దోపిడీ, దౌర్జన్యం, వివక్ష పెచ్చరిల్లి పోయింది. పోలీసుల దమనకాండ మరింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవినీతి చాప కింద నీరులా పేరుకు పోయింది. మొత్తంగా చూస్తే నీతి, నిబద్దత కలిగిన అధికారులు, ఉన్నతాధికారుల్లో పది శాతం ఉన్నారు. ఇదే సమయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా, వృత్తిని దైవంగా భావిస్తూ పనిచేస్తున్న వారు ఈ సమాజంలో ఉన్నారు.
తమ పనులు తామే చేసుకునే వారు కూడా లేక పోలేదు. ఇలాంటి అరుదైన సంఘటన తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తాను అత్యున్నతమైన పదవిలో ఉన్నప్పటికీ ఎలాంటి డాబు, దర్పాన్ని ప్రదర్శించలేదు. ఇంతగా చెప్పుకుంటున్న ఆయన ఎవరో కాదు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు లో జస్టిస్ గా ఉన్నారు కోదండరాం. ఆయన చేసిన పనితో దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. అధికారం.. హోదా.. చిటికేస్తే పనులు చేసిపెట్టే మనుషులు.. ఇలా అన్నీ ఉన్నా ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టారు. ఆయనే స్వయంగా ఎంగిలి పేట్లు ఎత్తారు. ఈ ఘటనకు హైకోర్టు ప్రాంగణం వేదికైంది. హైకోర్టులో సీని యర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. లాయర్లు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ టీ తాగారు.. బిస్కెట్లు.. సమోసాలు తిన్నారు. ఎప్పటి లాగే ప్లేట్లు అక్కడే పడేసి వెళ్లిపోయారు.
ఇదంతా గమనిస్తున్న జస్టిస్ చల్లా కోదండరామ్‌కు మనసు చివుక్కుమంది. న్యాయవాదులుగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలా ఎక్కడపడితే అక్కడ, అది కూడా హైకోర్టు ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా మార్చడాన్ని భరించలేక పోయారు. వెంటనే స్వయంగా వచ్చి ఆ ప్రదేశం మొత్తం కలియ తిరుగుతూ వారంతా పడేసిన ఎంగిలి ప్లేట్లను ఎత్తడం ప్రారంభించారు. మొదట్లో లాయర్లకు జస్టిస్ ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎంగిలి ప్లేట్లు తీస్తున్నారని అర్థం చేసుకున్న న్యాయవాదులు ఆయనతో పాటు ప్లేట్లను తీయడం ప్రారంభించారు. మొత్తం మీద జస్టిస్ చేసిన పనితో ఒక్కసారిగా హీరోగా మారి పోయారు. ఏది ఏమైనా అధికారం అన్నది కొద్దీ సేపే. సర్వీస్ అన్నది నిరంతరంగా ఉండేది. కోట్లు, భవంతులు, ఆస్తులు, ఆభరణాలు ఏవీ మనవెంట రావని జస్టిస్ కోదంరాం గుర్తించారు. తన పదవికి వన్నె తెచ్చారు. జస్టిస్ ను చూసి మిగతా వారు బుద్ది తెచ్చు కోవాలి. హ్యాట్స్ ఆఫ్ జస్టిస్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి