దిగ్గజ నేతలు..కలిసిన కత్తులు
ప్రపంచం ఎంతో అతృతతో ఎదురు చూసే క్షణాలు రానే వచ్చాయి. అభివృద్ధిలో దూసుకు వెళుతున్న ఇండియా, చైనా దేశాధినేతలు చెన్నైలోని మహాబలిపురం లో కలుసుకున్నారు. అంతకు ముందు చైనా అధినేత జిన్ పింగ్ కు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తమిళనాడు ప్రభుత్వం స్వాగతం పలికింది. అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత నడుమ చెన్నై విమానాశ్రయం లో జిన్ పింగ్ కాలు మోపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించేందుకు ఈ సమావేశం ఉపయోగ పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శత్రువును సైతం ఆత్మీయంగా పలకరించే సంప్రదాయం మొదటి నుంచి భారత్ పాటిస్తూ వస్తోంది. వ్యాపార, వాణిజ్య పరంగా చైనా, ఇండియా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఎవరూ ఊహించని రీతిలో అందరిని విస్తు పోయేలా చేశారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన స్వతహాగా పూర్తిగా సాంప్రదాయ బద్దంగా పంచె, జుబ్బా, తువ్వాలుతో అచ్చం తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అగుపించారు. ఎప్పుడూ షూట్, బూటుతో కనిపించే మోడీ పంచెకట్టుతో చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. మొన్నటి దాకా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన చైనా ఉన్నట్టుండి తన వైఖరిని మార్చుకుంది. భేదాలను పక్కన పెట్టి ఇండియాలో పర్యటించేందుకు జిన్ పింగ్ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. యుఎన్ లో జరిగిన సమావేశంలో వీరివురు పాల్గొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఇండియాకు రావాలని జిన్ పింగ్ ను కోరారు.
అందుకు జిన్ పింగ్ సమ్మతి తెలియ చేశారు. ఇదే క్రమంలో హ్యూస్టన్ లో జరిగిన మీటింగ్ లో మోడీ ట్రంప్ ను మెస్మరైజ్ చేశారు. మహాబలిపురం కేంద్రంగా జిన్ పింగ్ ..మోదీలు ఏకాంతంగా సమావేశం అయ్యారు. దీంతో అమెరికా, రష్యాతో పాటు దాయాది పాకిస్థాన్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. మొత్తం మీద స్నేహాన్ని అందించడం లోనూ, ఆతిథ్యము ఇవ్వడంలోనూ మోడీకి సాటిరారు ఎవ్వరు అనేది దీంతో తేలిపోయింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగి పోతుందని ఆశిద్దాం. అంతకు ముందు మోడీ స్వయంగా జిన్ పింగ్ కు కొబ్బరి నీళ్లను ఇవ్వడం హైలెట్ గా నిలిచింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి