పల్లవించిన స్నేహం..విస్తు పోయిన ప్రపంచం
నిన్నటి దాకా ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చిన ఇండియా, చైనా దేశాలు ఇప్పుడు అన్నిటిని మరిచి పోయి స్నేహమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అంటూ పాట పాడుకుంటున్నాయి. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సమావేశమయ్యారు. వీరిద్దరూ చెన్నయిలోని మహాబలిపురం లో సమావేశం కావడాన్ని ప్రపంచంలోని దేశాలన్నీ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. సముద్ర తీరంతో పాటు శిల్ప కళా నైపుణ్యానికి పెట్టింది పేరైన మహాబలిపురం అందాలను ప్రధాని దగ్గరుండి జిన్ పింగ్ కు చూపించారు. తానే గైడ్ గా మారి పోయి దాని చరిత్రను విడమరిచి చెప్పారు. ఇక్కడి భారత్ ఆతిథ్యం చూసి జిన్ పింగ్ ఎంతో ఆనందానికి లోనయ్యారు.
ఇక్కడి ప్రశాంత వాతావరణం జిన్ పింగ్ ను సంతోషానికి లోను చేసింది. అంతా ఢిల్లీలో మీటింగ్ ఉంటుందని భావించారు. దానిని బ్రేక్ చేశారు ప్రధాని మోదీ. ఈ పీఎం కొలువు తీరాక అన్ని ప్రోటోకాల్స్ ను పక్కన పెట్టారు. ఎవరితోనైనా సరే బయట సమావేశం ఉండేలా చూస్తున్నారు. అంతే కాదు ఇక్కడికి వచ్చిన వారందరికీ భారతీయ వంటకాలను రుచి చూపిస్తున్నారు. జిన్ పింగ్ కు అపూర్వమైన రీతిలో స్వాగతం పలికారు ఇక్కడి నేతలు. జిన్ పింగ్ టూర్ లో చైనా నుంచి వచ్చిన ప్రత్యేక కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సముద్ర తీరంలో 7వ శతాబ్దం నాటి శిల్పకళా నైపుణ్యంతో అలరిస్తున్న మహాబలిపురంలో చర్చలు జరిగాయి. మోడీ, జిన్ పింగ్ ల మధ్య సమావేశం జరగడం ఇది రెండోసారి.
ఇరువురు నేతలు పల్లవ రాజులు నిర్మించిన అత్యద్భుత కట్టడాలను సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్ర ధారణలో ఉన్న మోదీ.. జిన్‌పింగ్‌కు యునెస్కో గుర్తింపు పొందిన శిల్పకళా సంపద చారిత్రక ప్రాధాన్యతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని వివరించారు. కొబ్బరి నీరు తాగి కాసేపు సేద తీరారు. అనువాదకుల సాయంతో ఇరువురు నేతలు ముచ్చటించుకున్నారు. అనంతరం సముద్ర తీరంలో నిర్మితమైన శివ విష్ణు రాతి దేవాలయాన్ని సందర్శించారు. సూర్యాస్తమయం వేళ అక్కడి ప్రకృతి దృశ్యాలను కాసేపు ఆస్వాదించారు. కాగా దాయాది పాకిస్తాన్ దెబ్బకు మిన్నకుండి పోయింది. నిన్నటి దాకా పాక్ కు వంత పాడుతూ వచ్చిన చైనా తన తీరును మార్చుకుంది. ఇండియాకు స్నేహ హస్తం చాటింది. దౌత్య పరంగా చూస్తే ఇది కీలక పరిణామమేనని భావించక తప్పదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి