లుక్స్ పర్ఫెక్ట్ ..శ్రీముఖి బెస్ట్

ప్రయోక్తగా ఇప్పటికే టాప్ రేంజ్ లో కొనసాగుతున్న శ్రీముఖి బిగ్ బాస్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. వినోద రంగంలో స్టార్ టీవీకి తిరుగు లేకుండా పోయింది. భారతీయ క్రికిట్ ప్రసార హక్కులను 1700 కోట్లకు చేజిక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఇటీవల తెలుగు బుల్లితెరపై మాటీవీ తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నది. దీనిని అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. సౌత్ ఇండియాలో స్టార్ టీవీ పాగా వేసింది. దాదాపు 300 కోట్లకు చేజిక్కించుకున్నట్లు వినోద రంగాలు పేర్కొంటున్నాయి. కోట్లాది రూపాయలు రోజుకు స్టార్ టీవీ గ్రూప్ కు వస్తున్నాయి. తెలుగు వినోద రంగంలో ఇప్పుడు స్టార్ మా టీవీ దుమ్ము రేపుతోంది. డిఫరెంట్ గా ప్రోగ్రామ్స్ రూపొందిస్తూ, సీరియల్స్ పరంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది.

స్టార్ టీవీ మూడో సారి స్టార్ట్ చేసిన బిగ్ బాస్ కు భారీ ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ లో రేటింగ్ మరింత పెరిగింది. ఈ రియాల్టీ షో లో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, అలీ, తదితరులు తమ ప్రతిభతో పోటాపోటీగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టిసిపెంట్స్ లలో యాంకర్‌ శ్రీముఖి తళుక్కున మెరుస్తోంది. ఆమె ధరిస్తున్న దుస్తులు సరికొత్త అందాలకు చిరునామాగా మారాయి. రోజుకో అరుదైన డిజైన్‌తో అదరగొడుతోంది. నగర యువతులు ఆమె వస్త్రధారణనే అనుకరిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పటి సినీనటి వాణిశ్రీ కట్టిందంటే అవి మార్కెట్‌లో ఆవిడ పేరుతోనే పిలుచుకునే వారు. బిగ్‌బాస్‌లో శ్రీముఖి డ్రెస్‌లు అదే స్థాయిలో హైలెట్‌గా నిలుస్తున్నాయి.

శ్రీముఖికి డ్రెస్‌లు, జ్యువెలరీ డిజైన్‌ చేస్తోంది ‘రేఖాస్‌’ బొటిక్‌ పేరుతో డిజైనర్‌ షోరూమ్‌ను నడిపిస్తున్న డిజైనర్‌ కీర్తన సునీల్‌ చేస్తోంది. శ్రీముఖికి దుస్తులను సరికొత్త తీరులో, కలర్‌ఫుల్‌ కాంబినేషన్‌లో ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ తెరపై ఆమెకు కొత్త లుక్‌ను తీసుకొస్తున్నారు. కొన్ని వారాలుగా బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగుతున్న శ్రీముఖికి ఇప్పటి వరకు రోజుకొకటి చొప్పున 76 డ్రెస్‌లను ధరించింది. బిగ్‌బాస్‌లో ప్రత్యేకంగా డిజైనర్‌ ఏర్పాటు చేసుకున్న ఘనత కూడా శ్రీముఖికే దక్కుతుంది. స్లీవ్‌లెస్, నెక్‌లైన్‌ డీప్‌గా ఉండే డ్రెస్సులను శ్రీముఖి ఎంతమాత్రం ఇష్టపడడం లేదు. ఎక్కువగా తెలుగుదనం ఉండేలా డ్రెస్సులను శ్రీముఖి సెలెక్ట్ చేసుకుంటోంది. ఇదే ఎక్కువగా యూత్ ను ఆకట్టుకుంటోంది. మొత్తం మీద బిగ్ బాస్ - 3 ఎపిసోడ్ లో మాత్రం పోటీ రసవత్తరంగా మారినా శ్రీముఖి మాత్రం హల్ చల్ చేస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!