నెట్టింట్లో పేపర్ బాయ్ హల్ చల్..!

పేపర్ బాయ్ అంటే ఇదేదో తెలుగు సినిమా ఆనుకుంటే పొరపాటు పడినట్లే . పట్టుమని 19 ఏళ్ళు కూడా నిండని ఆ యువకుడి మదిలో మెదిలిన ఐడియా ఇవ్వాళ అంతర్జాలంలో హల్ చల్ చేసేస్తోంది. ఒక్కో స్టార్ట్ అప్ ఒక్కో బ్రాండ్ ఇమేజ్ ను స్వంతం చేసుకుంటూ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. నిప్పులు చిమ్ముకుంటూ నేనెగిరి పోతే నిబిడాక్షర్యంతో మీరే మీరే అంటూ మహాకవి శ్రీ శ్రీ ని గుర్తుకు తెస్తున్నాడు బెంగళూర్ కు చెందిన వెంకట్ కార్తీక్ రాజా. ఇదే వయసు కలిగిన యువకులంతా సోషల్ మీడియాలోనే లేదా స్మార్ట్ ఫోన్స్ లలో బూతు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటే ఇతను మాత్రం పది మందికి దారి చూపించేలా కత్తి లాంటి ఆలోచనను ఆచరణలోకి తీసుకు వచ్చాడు. ఎక్కడా టైం ను వేస్ట్ చేయకుండా తాను ఏది అనుకున్నాడో అదే చేశాడు. సక్సెస్ అయ్యాడు. పొద్దున్న లేస్తేనే చాలా మంది ఇళ్లల్లోకి వచ్చే పేపర్లన్నీ వేసేది పిల్లలే. అందుకే మనోడు తన విన్నూతమైన ఐడియాకు పేపర్ బాయ్ అని పేరు పెట్టాడు. ఏదైనా సాధించాలన్నా, లేదా ఇతరులకంటే భిన్నంగా బిజినెస్ లో రాణించాలన్నా మన ప్రోడక్ట్ పేరు అందరికీ అర్థమయ్యేలా, త్వరగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అదే ఒక బ్రాండ్ ను క్రియేట్ చేస్తుంది. అందరిలాగే తనక...