కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..కలవర పడుతున్న అధినేతలు
దాయాదులైన పాకిస్తాన్, ఇండియాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై నిప్పులు చెరుగుతున్నారు. స్వతహాగా మాజీ క్రికెట్ సారధి కావడంతో వార్ ఎలా మొదలు పెట్టి ఎలా ముగించాలో తనకు బాగా తెలుసునంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎప్పుడైతే ఇండియా జమ్మూ , కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నదో అప్పటి నుంచి పాకిస్తాన్ గుర్రుగా ఉంటోంది. ఇండియాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. మరో వైపు ఎన్నడూ లేని విధంగా తమ దేశంలో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికానేనంటూ సంచలన కామెంట్స్ చేశారు ఇమ్రాన్ ఖాన్. ఆయన అమెరికాలో ఇటీవల పర్యటించారు కూడా.
ఇదే సందర్భంలో తమ దేశంలో తీవ్రవాదులు ఉన్నారంటూ దీనికి గత పాలకులే కారణమంటూ వెల్లడించారు. భారత్ పాక్ చేస్తున్న దురాగతాలను, కవ్వింపులకు పాల్పడుతూ దేశంలో అస్థిరత కలిగించేలా, వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులకు దిగబడటం పై పక్కా ఆధారాలతో సహా నిరూపించింది. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు ఒక్క చైనా తప్పా ఇండియాకు బేషరతుగా మద్దతు పలికాయి. అమెరికా, రష్యా జమ్మూ, కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని నొక్కి చెప్పాయి. సాధ్యమైనంత త్వరలో భారత్ తో చర్చలు జరపాలని ఇమ్రాన్ ఖాన్ కు డోనాల్డ్ ట్రంప్ సూచించారు. ఒక్కసారిగా ఇమ్రాన్ ఖాన్ ఒంటరి అయిపోయాడు. అయినా తన వక్ర బుద్దిని మార్చుకోలేదు. ప్రపంచ ఉగ్రవాదుడిగా పేరొందిన మసూద్ అజహర్ ను ఇటీవలే విడుదల చేసిందన్న విషయాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఇండియా అంతటా హై అలర్ట్ ప్రకటించింది హోమ్ శాఖ.
తాము భారత్ తో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇమ్రాన్ ఆల్ జజీరా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇక యుద్ధమే మిగిలిందని, అది సాంప్రదాయ వార్ కనుక మొదలు పెడితే భారత్ కు అడ్వాంటేజ్ అవుతుందని, పాకిస్తాన్ కు ఇబ్బందులు ఉంటాయని అంగీకరించారు. మొత్తంగా చూస్తే అణు యుద్ధానికే తాము కట్టుబడి ఉన్నామంటూ ప్రకటించారు. ఇంకో వైపు మసూద్ పేరుతో ఓ లేఖ ఇండియాకు వచ్చింది. త్వరలో దాడులకు పాల్పడబోతున్నామని హెచ్చరించారు. దీనిని సీరియస్ గా తీసుకుంది ఇండియా. అయితే ఏ యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని, ఇక ఆగే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు మోడీ అమెరికాకు తెలిపారు. వార్ జరిగితే పాకిస్తాన్ కే ఎక్కువ నష్టం కలుగుతుంది.
చైనా పాక్ కు సపోర్ట్ చేసినా దానికి కూడా ఇండియాతో పోరు కోరుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం జరగదని, పాకిస్తాన్ ఎటూ పాలు పోక వార్ బూచి చూపించి మరో నాటకానికి తెర లేపిందని ఎక్స్ పర్ట్స్ పేర్కొంటున్నారు. మొత్తం మీద యుద్ధం అనివార్యమైతే ఏం జరుగుతుంది అనేది మోడీ, అమిత్ షా కంటే ఎక్కువగా భారత భద్రత సలహాదారు అజిత్ దోవల్ ను అడిగితే తెలుస్తుంది. ఆయన ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో పాకిస్తాన్ పునరాలోచనలో పడింది. ఏ మాత్రం ఓటమి అంటూ ఒప్పుకోని దోవల్ ఎప్పుడు ఎలా దెబ్బ కొడతాడో ఎవ్వరికీ తెలియదు. దోవల్ పవర్ ఏమిటో తెలిసిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తన ప్లేస్ ను మార్చుకున్నాడంటే ఆయనకు ఉన్న పవర్ ఏమిటో అర్థం చేసు కోవచ్చు. మొత్తం మీద ఇండియా, పాక్ ల మధ్య మాటల యుద్ధం మాత్రం వైరల్ అవుతోంది..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి