నిర్మలమ్మ నిర్ణయం..హోసింగ్ కు ఊతం..!

డీలా పడి, కునారిల్లి పోయిన గృహ నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోసింగ్ కు వరాలు ప్రకటించారు ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ఈ రంగం బల పడనుంది. ఇందు కోసం ప్రత్యేకంగా ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మధ్య తరగతి ఇళ్లకు ఏకంగా 20 వేల కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో ఉన్నది. ఆర్థిక వృద్ధి రేటు ఎన్నడూ లేనంతగా దిగి పోయింది. దీనికి కాయకల్ప చికిత్స చేసేందుకు విత్త మంత్రి రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్క దిద్ది, ఉద్దీపన చర్యలు చేపట్టే పనిలో పడింది. ఆర్ధిక మంద గమనం పెరుగుతూ ఉండటం ప్రభుత్వాన్ని బెంగకు గురి చేస్తోంది.

దీని వల్ల దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. దేశ ప్రజల్లో గణనీయంగా కొనుగోలు నశించింది. ప్రత్యేక పథకాలు, రాయితీలు ఇవ్వగలిగితే కొంత మేర సంక్షోభం నుంచి గట్టెక్క వచ్చు అనేది ప్రభుత్వం ఆలోచన. అందుకే ప్రతి అవకాశాన్ని పరిగణలోకి తీసుకుంటోంది. మొదటగా ఎగుమతులను పెంచడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్క వచ్చు. ఇవ్వన్నీ అమలు కావాలంటే 50 వేల కోట్లు అవసరమవుతాయని గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా మూడున్నర లక్షల మందికి లబ్ది కలుగుతుందన్నారు. ఆగి పోయిన మధ్యతరగతి ప్రాజెక్టులకు లిక్విడిటీ ని అందించడం , ఎగుమతులను పెంచు కోగలిగితే సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తోంది.

ఫండింగ్ ఏర్పాటు చేయడంతో వేలాది మందికి లబ్ది చేకూరనుంది. రుణాలు, నిధులు లేక మధ్యలోనే ఆగి పోయిన ఇళ్లకు ఇది ఊతమిస్తుంది అని మంత్రి చెబుతున్నారు. దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఫ్లాట్స్ మధ్యలోనే ఆగి పోయాయి. ఈ రంగంలో నిధుల లేమి అంటూ లేదన్నారు. ప్రభుత్వం 10 వేల కోట్లు సమకూరిస్తే, ఎల్ ఐసీ , క్యాపిటల్ బ్యాంక్స్ సావరిన్ ఫండ్స్, డీఎఫ్ ఐలు మరో 10 కోట్లు సమకూరుస్తాయని మంత్రి వెల్లడించారు. మొత్తం మీద మంత్రి ప్రకటన చతికిల పడిన హోసింగ్ , రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకునే వీలుండే అవకాశం ఉన్నది. మరో వైపు ఈ నిర్ణయం తో రియల్టర్లకు మేలు చేకూరేలా ఉందంటూ విపక్షాలు మండి పడుతున్నాయి. 

కామెంట్‌లు