అంబానీలకు నోటీసులు - దిగ్గజ కంపెనీలకు గుబులు..!
భారత దేశ వ్యాపార రంగంలో తనకంటూ ఓ బ్రాండ్, ఇమేజ్ స్వంతం చేసుకున్న రిలయన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన ముకేశ్ , అనిల్ అంబానీలు కేంద్ర ఆదాయ పన్ను శాఖ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆయిల్, టెలికాం. లాజిస్టిక్స్, డిజిటల్ టెక్నాలజీ, జ్యుయలరీ , ఫ్యాషన్స్, ఈ కామర్స్ , తదితర రంగాలలో టాప్ పొజిషన్ లో ఉన్న సదరు కంపెనీకి లెక్కకు మించి ఆస్తులు ఉన్నాయని, దానికి సంబంధించిన లెక్కలు సరిగా లేవంటూ ఐటీ నోటీసులు జరీ చేసింది. ఒక్కసారిగా ఇండియన్ మార్కెట్ ఈ ఒకే ఒక్క వార్తతో కుదుపునకు లోనైంది. ఇప్పటికే టెలికాం రంగాన్ని ఆర్ ఐ ఎల్ శాసిస్తోంది. ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతోంది. తాజాగా విదేశాల్లో బిగ్ కంపెనీలపై కన్నేసింది.
అక్కడ కూడా టేకోవర్ చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. రోజు రోజుకు బిజినెస్ పెంచుకుంటూ పోవడంతో రిలయన్స్ షేర్స్ అమాంతం పెరిగాయి. ఇటీవలే ముంబై లో జరిగిన సమావేశంలో ముకేశ్ ఇండియాను పరుగులు పెట్టేలా చేస్తామని, అది ఇంటర్ నెట్ లో సంచలనం కలిగిస్తుందని చెప్పారు. అంతే కాకుండా అతి తక్కువ ధరకు డైరెక్ట్ టూ హోమ్ సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా షేర్లు పెరిగాయి. మదుపరులకు భారీగా ఆదాయం సమకూరింది. ఉన్న అప్పులు అన్నవి తమకు లెక్క కాదంటూ ముకేశ్ వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు లోపు అన్నీ క్లియర్ చేస్తామని తెలిపారు. దీంతో బిజినెస్ మరింతగా పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఐటీ శాఖ రిలయన్స్ కంపెనీల లావాదేవీలపై కన్నేసింది.
ఆదాయ, వ్యయాల తీరు తెన్నులపై ఆరా తీసింది. ఆ మేరకు సదరు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఇదే విషయంపై ఆర్ఐ.ఎల్ కంపెనీల ప్రతినిధులు మాత్రం అలాంటిది ఏమీ లేదంటూ కొట్టి పారేశారు. ముకేశ్ అంబానీ, కొడుకు, కూతురులకు కూడా ఈ నోటీసులు అందినట్లు సమాచారం. 2015 బ్లాక్ మనీ యాక్టు కింద ఈ ఏడాది మార్చి 28 న ఈ నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా జెనీవాలోని హెచ్ ఎస్ బీసీ బ్యాంకు లో అకౌంట్లు ఉన్న 700 మంది ఖాతాలతో పాటు సంస్థలపై దృష్టి సారించింది. కేవలం 14 అకౌంట్ల లోనే దాదాపు 4 వేల 200 కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఈ అకౌంట్లతో రిలయన్స్ గ్రూప్ కు సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. మిగతా దిగ్గజ కంపెనీలు దెబ్బకు డీలా పడ్డాయి. ఎప్పుడు తమ మీద ఐటీ శాఖ దాడి చేస్తుందోనని బెంబేలెత్తి పోతున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి