విహారం తీరని విషాదం ..కన్నీళ్లను మిగిల్చిన గోదారి..!

నిండు కుండలా ప్రవహిస్తున్న గోదావరి తీరని విషాదాన్ని మిగిల్చింది. విలువైన ప్రాణాలు పోయేలా చేసింది. అతిపెద్ద ఘోరం జరిగి పోయింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనికంతటికి పర్యాటక శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. పర్యాటకులను ఎక్కించుకున్నపుడు అన్నీ సక్రమంగా ఉన్నాయో చూసు కోవాల్సిన భాద్యత బోటు నిర్వాహకులపై ఉంటుంది. ఈ విషాదానికి కేంద్ర బిందువుగా తూర్పు గోదావరి జిల్లా మారింది. ఉన్నతాధికారులు, మంత్రి, ప్రజా ప్రతినిధులు హుటా హుటిన ప్రమాద సంఘటన చోటు చేసుకున్న దేవీపట్నం మండలం కచ్చులూరుకు తరలి వెళ్లారు. సహాయక చర్యలలో మునిగి పోయారు. ఇక్కడే పర్యాటక బోటు గల్లంతైంది.

ప్రమాద సమయంలో ఆ బోటు లో  దాదాపు 61  మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. నిన్నటి దాకా గోదావరి ఉగ్ర రూపాన్ని చూపించింది. ప్రమాదపు స్థాయిని దాటుకుని ప్రవహించింది. ఎగువన కురుస్తున్న వర్షాల దెబ్బకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో దివిసీమ తీవ్ర ఇబ్బందులకు లోనైంది. ఇదే సమయంలో పర్యాటక శాఖ అధికారులు ఎందుకు బోటు ను అనుమతి ఇచ్చారో తెలియడం లేదు. ఒకవేళ ఇచ్చినా ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి గతంలో. అయినా అధికారులకు ఎందుకు పట్టించు కోవడం లేదో వారికే తెలియాలి. కాగా గోదావరి నదిలో వరద ఉద్ధృతి తగ్గడంతో బోటు పర్యాటకులతో కచ్చులూరు నుంచి పాపికొండలుకు వెళుతోంది . గల్లంతు అయిన వారి కోసం రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ప్రభుత్వ సీఎస్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ  ఘటనలో ఇప్పటి వరకు 12 మండి మృతి చెందినట్టు సమాచారం. ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉన్నది.

ప్రైవేట్‌ బోట్‌ల యాజమాన్యాలు దేవీపట్నం గోదావరిపై వరదల సమయంలో విహార యాత్రలకు బోట్‌లను తిప్పుతున్నారని ఆరోపణలున్నాయి. బోటును ఎందుకు నిలువరించలేక పోయారో తెలియడం లేదు. దేవిపట్నంలో 36 గ్రామాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో పాపికొండల విహారానికి పర్మిషన్ ఇవ్వడం ఓ రకంగా ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడమే. గతంలో మంటూరు - వాడపల్లి మధ్య ఒక లాంచి మునిగి 19 మంది మృత్యువాత  పడ్డారు. అప్పటి నుంచి బోట్‌ల రాకపోకలకు సంబంధించిన పర్మిషన్స్ ను పశ్చిమగోదావరి జిల్లా అధికారులే ఇస్తున్నారు. కాగా సురక్షితంగా బయట పడిన 16 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ  ఘటనలో హైదరాబాద్, వరంగల్ వాసులు ఉన్నట్లు సమాచారం. సీఎం మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాద ఘటనపై జగన్, కేసీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మొత్తం మీద పర్యాటక శాఖ అధికారుల నిర్వాకం ప్రయాణికులను జల సమాధి చేసేలా చేసింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!