పోస్ట్‌లు

డిసెంబర్ 29, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బుట్టబొమ్మ..ముద్దు గుమ్మ

చిత్రం
మాటల మాంత్రికుడు, డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..రైజింగ్ స్టార్ అల్లు అర్జున్..అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే తో తీస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్స్, ట్రైలర్స్ విడుదల చేశింది చిత్ర యూనిట్. ఇక మూవీకి చెందిన పాటలు యూట్యూబ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. తాజాగా రామజోగయ్య శాస్త్రి రాసిన బుట్టబొమ్మ పాటను లక్షలాది మంది వీక్షించారు. ఈ పాట కూడా రికార్డ్ క్రియేట్ చేసే దిశగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారి పోయారు ఈ ముద్దుగుమ్మ. అల..వైకుంఠపురములో చిత్రంలో ఈ బుట్టబొమ్మ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా డైరెక్టర్ తీర్చి దిద్దినట్లు సమాచారం.  తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు జరుపుకుంటోంది. అయితే  బుట్టబొమ్మ సాంగ్‌తో పూజా హెగ్డే షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేసింది. అయితే ఈ పాట షూట్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ ఇది ఎవరికీ చెప్పకండి అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీ...

పాపులర్ యాప్స్ ఇవే

చిత్రం
నిన్నటి దాకా ఎవరి ప్రపంచం వారిదే. ఎవరి లోకం వాళ్లదే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చాక వరల్డ్ పూర్తిగా మారి పోయింది. ఈ లోక మంతటా ఇప్పుడు చిన్నదై పోయింది. ఎంతలా అంటే వదిలి ఉండ లేనంత. అంతలా అల్లుకు పోయింది సోషల్ మీడియా. ప్రతి రోజు ఉదయాన్ని చూసే వాళ్ళు కొందరే ఉంటారేమో కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం నిత్యం గడుపుతున్నారు. దానిని వాడక పోతే మాత్రం చచ్చి పోయే స్థితికి చేరుకున్నారు. అంతలా అడిక్ట్ అయి పోయారు. అన్నిటి కంటే టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ వచ్చాక ప్రపంచం ప్రతి ఒక్కరి దరికి వచ్చేసింది. తాజాగా ఈ సోషల్ మీడియాలో ఏది పాపులర్ దిగ్గజ కంపెనీనో తెలుసు కోవాలని ఉత్కంఠ ఉండడం మామూలే. ఈ సరి మరోసారి ముఖ పుస్తకం తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఫేస్‌బుక్‌ మరో మైలు రాయిని అందుకుంది. 2010 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌లో ఫేస్‌బుక్, ఎఫ్ బి మెసెంజర్లు మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలపై ఆరోపణలు, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం ఇవేవి ఫేస్‌బుక్‌ హవాను ఏమాత్రం నిలువరించ లేక పోయాయి. యాప్‌ యానీ అనే యాప్‌ సంస్థ ఈ దశాబ్దంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న య...

జూపల్లి ఇక కింగ్ మేకర్

చిత్రం
జూపల్లి అంటే ఒకప్పుడు ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో. ఎప్పుడైతే కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొలువు తీరారో ఇక అప్పటి నుంచి మై హోమ్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు పేరు ప్రతిరోజు వినిపిస్తోంది. అంతే కాదు జగత్ గురు గా వినుతి కెక్కిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీ హవా కొన సాగుతున్నదో, దాని వెనుక అదృశ్య శక్తిగా రామేశ్వర్ రావు మరింత పాపులర్ అయి పోయారు. ఎంతగా అంటే మూడు రాష్ట్రాల ముఖ్యమంతులతో కలిసి మాట్లాడేంత సాన్నిహిత్యం పెరిగి పోయింది. ఆయన ఇప్పుడు ఒకరకంగా తెలంగాణ ముకేశ్ అంబానీ. అనకొండలా అన్ని రంగాల్లో విస్తరించింది మై హోమ్ కంపెనీ. దీనికి కర్త కర్మ క్రియ అంతా రామేశ్వర్ రావు తమ్ముడు జూపల్లి జగపతి రావు. నిన్నటి దాకా నిర్మాణ రంగంలో ఉన్న జూపల్లి కుటుంబం మీడియా లోకి కూడా ఎంటర్ అయ్యింది. కాగా ఇప్పటి దాకా ఐర్లాండ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్‌ మెటీరియల్‌ కంపెనీ సీఆర్‌హెచ్‌ ఇండియాతో కలిసి, ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్‌ ఇండస్ట్రీస్‌’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హె...

ప్రేమికులం కాదు స్నేహితులం

చిత్రం
 ఇటీవల తెలుగు బుల్లితెర మీద బిగ్ బాస్ - 3 కంటెస్టెంట్స్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. సినిమా నటీనటులకు ఉన్నంత క్రేజ్ వీరికి వచ్చింది. ఈ రియాల్టీ షో ఇండియాలో టాప్ వన్ లో కొనసాగింది. కోట్లాది మంది ఈ ప్రోగ్రాం ను వీక్షించారు. పాల్గొన్న వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, వర్ధమాన నటి పునర్నవి లు మరింత పాపులర్ అయ్యారు. వీరు ఏది మాట్లాడినా లేదా ఎక్కడైనా ఈవెంట్స్ కు హాజరైనా క్షణాల్లో వైరల్ అవుతున్నారు. తాజాగా రాహుల్‌, పునర్నవితో కలిసి సందడి చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్న వారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్‌, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరగగా, వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్‌, పునర్నవితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రంగమార్తాండ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్‌ ...

కామెంట్స్ కలకలం..ఆగని వైనం

చిత్రం
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన కామెంట్స్ పాకిస్తాన్ క్రికెట్ లో కలకలం రేపాయి. తాను క్రికెట్‌ ఆడిన సమయంలో   కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకేం పాక్ ఆటగాళ్లు షోయబ్ పై విరుచుకు పడ్డారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇదే అంశంపై ఇండియన్ క్రికెటర్లు మద్దతు పలికారు. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. మియాందాద్‌,ఇంజమాముల్‌ , మహ్మద్‌ యూసఫ్‌, షాహిద్‌ అఫ్రిదిలు అక్తర్‌ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. కనేరియా హిందూ అనే కారణంగా ఎవరూ అవమానించ లేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆ వివక్ష భారత్‌లో లేదా అంటూ కూడా అక్తర్‌ను ప్రశ్నించారు. కామెంట్స్ చిలికి చిలికి గాలి వానగా మారాయి. దీంతో అక్తర్‌ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. తాను ఏ సందర్భంలో, ఎందు కోసం అన్నానో ముందు తెలుసు కోవాలన్నాడు. తనపై వస్తున్న విమర్శలకు బాధ్యత వహిస్తూ సమాధానం కూడా ఇవ్వాల్సి ఉందన్నాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో మొత్తంగా మత వివక్ష ఉందని తాను అనలేదని,  కేవలం ఒకరో, ఇద్దరో కనేరియాను హిందూ అనే కారణంగా చిన్న చూపు చూసేవారని మాత్రమే తాను పేర్కొనట్లు అక్తర్‌ తెల...