పాపులర్ యాప్స్ ఇవే

నిన్నటి దాకా ఎవరి ప్రపంచం వారిదే. ఎవరి లోకం వాళ్లదే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చాక వరల్డ్ పూర్తిగా మారి పోయింది. ఈ లోక మంతటా ఇప్పుడు చిన్నదై పోయింది. ఎంతలా అంటే వదిలి ఉండ లేనంత. అంతలా అల్లుకు పోయింది సోషల్ మీడియా. ప్రతి రోజు ఉదయాన్ని చూసే వాళ్ళు కొందరే ఉంటారేమో కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం నిత్యం గడుపుతున్నారు. దానిని వాడక పోతే మాత్రం చచ్చి పోయే స్థితికి చేరుకున్నారు. అంతలా అడిక్ట్ అయి పోయారు. అన్నిటి కంటే టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ వచ్చాక ప్రపంచం ప్రతి ఒక్కరి దరికి వచ్చేసింది. తాజాగా ఈ సోషల్ మీడియాలో ఏది పాపులర్ దిగ్గజ కంపెనీనో తెలుసు కోవాలని ఉత్కంఠ ఉండడం మామూలే.

ఈ సరి మరోసారి ముఖ పుస్తకం తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఫేస్‌బుక్‌ మరో మైలు రాయిని అందుకుంది. 2010 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌లో ఫేస్‌బుక్, ఎఫ్ బి మెసెంజర్లు మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలపై ఆరోపణలు, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం ఇవేవి ఫేస్‌బుక్‌ హవాను ఏమాత్రం నిలువరించ లేక పోయాయి. యాప్‌ యానీ అనే యాప్‌ సంస్థ ఈ దశాబ్దంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌ జాబితాను రూపొందించింది. ఆన్‌లైన్‌ డిజిటల్‌ స్పేస్‌లో ఎక్కువగా యాప్స్‌, గేమ్స్‌ డౌన్‌లోడ్ చేసిన వాటిని పరిగణలోకి తీసుకున్నారు.

భవిష్యత్తులో ఆన్‌లైన్‌కు సంబంధించిన మరిన్ని జాబితాలు రూపొందిస్తామని యాప్‌ యానీ పేర్కొంది. ముఖ పుస్తకం మొదటి ప్లేస్ లో ఉండగా తన మెసెంజర్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక మూడో ప్లేస్ లో సందేశాల పరంగా సెన్సేషన్ సృష్టిస్తూ కోట్లాది ప్రజలను ఒకే చోటుకు చేరుస్తున్న వాట్సాప్‌ నిలిచింది. మరో వైపు నాలుగో స్థానంలో ఇన్‌స్టాగ్రామ్‌, ఐదో ప్లేస్ లో స్నాప్‌చాట్‌, ఆరో స్థానంలో టిక్ టాక్, ఏడో స్థానంలో యూసీ బ్రౌజర్ ఉండగా ఎనిమిదో ప్లేస్ లో గూగుల్ కు చెందిన యూట్యూబ్‌ నిలువగా, ట్విటర్‌ తొమ్మిదో స్థానం దక్కించుకుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!