బుట్టబొమ్మ..ముద్దు గుమ్మ
మాటల మాంత్రికుడు, డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..రైజింగ్ స్టార్ అల్లు అర్జున్..అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే తో తీస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్స్, ట్రైలర్స్ విడుదల చేశింది చిత్ర యూనిట్. ఇక మూవీకి చెందిన పాటలు యూట్యూబ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. తాజాగా రామజోగయ్య శాస్త్రి రాసిన బుట్టబొమ్మ పాటను లక్షలాది మంది వీక్షించారు. ఈ పాట కూడా రికార్డ్ క్రియేట్ చేసే దిశగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే.
వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారి పోయారు ఈ ముద్దుగుమ్మ.
అల..వైకుంఠపురములో చిత్రంలో ఈ బుట్టబొమ్మ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా డైరెక్టర్ తీర్చి దిద్దినట్లు సమాచారం. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. అయితే బుట్టబొమ్మ సాంగ్‌తో పూజా హెగ్డే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసింది. అయితే ఈ పాట షూట్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది ఎవరికీ చెప్పకండి అంటూ సరదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టు కుంటోంది. అంతే కాకుండా ఈ సాంగ్‌లో బన్ని, పూజాల జంట చూడ ముచ్చటగా ఉందని కామెంట్ చేస్తున్నారు. బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ నన్ను సుట్టు కుంటివే..జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూ కుంటివే అంటూ పూజా హెగ్డే కోసం అల్లు అర్జున్ పాడే ఈ పాట ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించగా తమన్ కంపోజ్ చేశాడు. హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ డ్యుయెట్ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియలో భారీ సెట్ వేశారని టాక్. అంతే కాకుండా కొరియోగ్రఫర్స్ కూడా వీరిద్దరికి తగ్గట్టు డిఫరెంట్ స్టెప్స్ కంపోజ్ చేశారని, అవి పాటకు దృశ్య రూపంలో మరింత అందాన్ని తెస్తుందని సమాచారం. అంతే కాకుండా పూజా షేర్ చేసిన వీడియోలో కూడా ఇదే స్పష్టమవుతోంది. మరో వైపు బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇది వరకే వచ్చిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. దీంతో అల.. వైకుంఠపురములో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దీనికి తోడు సామజవరగమన, రాములో.. రాములా, బుట్టబొమ్మా వంటి సాంగ్స్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇక పాటలతో పాటు టీజర్ కూడా ఓ రేంజ్‌లో ఉండటంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, జయరామ్ వంటి భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. మొత్తం మీద పూజా హెగ్డే మోస్ట్ పాపులర్ కానుంది అన్నమాట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి