ప్రేమికులం కాదు స్నేహితులం

 ఇటీవల తెలుగు బుల్లితెర మీద బిగ్ బాస్ - 3 కంటెస్టెంట్స్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. సినిమా నటీనటులకు ఉన్నంత క్రేజ్ వీరికి వచ్చింది. ఈ రియాల్టీ షో ఇండియాలో టాప్ వన్ లో కొనసాగింది. కోట్లాది మంది ఈ ప్రోగ్రాం ను వీక్షించారు. పాల్గొన్న వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, వర్ధమాన నటి పునర్నవి లు మరింత పాపులర్ అయ్యారు. వీరు ఏది మాట్లాడినా లేదా ఎక్కడైనా ఈవెంట్స్ కు హాజరైనా క్షణాల్లో వైరల్ అవుతున్నారు. తాజాగా రాహుల్‌, పునర్నవితో కలిసి సందడి చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్న వారిలో రాహుల్‌, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు.

అయితే రాహుల్‌, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరగగా, వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్‌, పునర్నవితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రంగమార్తాండ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల
ప్రకాశ్‌రాజ్‌..రంగమార్తాండ చిత్ర బృందానికి ఓ పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీకి కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాహుల్‌, పునర్నవి, పలువురు సన్నిహితులు హాజరయ్యారు.
అయితే ఈ సందర్భంగా రాహుల్‌.. ఏమై పోయావే నీవెంటే నేనుంటే.. పాటు పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, ఫొటోలను రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ అని పేర్కొన్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రోజుకో ట్విస్ట్ ఇస్తూ రాహుల్, పునర్నవి లు ఫ్యాన్స్ కు మజా కలిగిస్తున్నారు. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!