అక్షరాస్యతలో అధమ స్థానం

విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు అందుకోలేక పోతోంది తెలంగాణ రాష్ట్రం. విద్యా శాఖ పూర్తిగా గాడి తప్పింది. అసమర్థులైన అధికారులు తిష్ట వేయడంతో ఈ గతి పట్టింది. ఈరోజు వరకు వేలాది ఖాళీలున్నా నేటికీ ఆరేళ్ళు కావస్తున్నా భర్తీ చేసిన పాపాన పోలేదు. బడులు, కాలేజీలు, యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థలు ఇప్పటికే పనిచేయడం మానేశాయి. మొత్తం ఇంచార్జీల సార్లతో నడుస్తున్నాయి. ఇక కేజీబీల సంగతి చెప్పనక్కర్లేదు. విద్యా శాఖ కార్యదర్శి ఏం చేస్తున్నారో ఆయనకే తెలియాలి. తాజాగా దేశ వ్యాప్తంగా ట్రైబల్ లిటరసీ గురించి ఏ రాష్ట్రం ఏ పొజిషన్ లో వుందో కేంద్ర సర్కార్ వెల్లడించింది. నిన్నటి దాకా బీరాలు పలికిన విద్యాశాఖాధికారులు విస్తు పోయేలా షాక్ ఇచ్చింది. చదువులో చాలా వెనుకబడి ఉన్నదన్న విషయాన్ని స్పష్టం చేసింది. కేవలం 49.5 శాతం అక్షరాస్యత రేటుతో మొత్తం 31 రాష్ర్టాల్లో 30వ స్థానంలో నిలిచింది. ఎస్టీల్లో లిటరసీ రేటు దేశంలో సగటున 59 శాతం ఉండగా, తెలంగాణలో దాదాపు పదిశాతం తక్కువ నమోదైంది. అతి తక్కువ అక్షరాస్యతతో కింది నుంచి మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. గిరిజనులను అక్షరాస్యులను చేసేందుకు కేం...