అక్షరాస్యతలో అధమ స్థానం
విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు అందుకోలేక పోతోంది తెలంగాణ రాష్ట్రం. విద్యా శాఖ పూర్తిగా గాడి తప్పింది. అసమర్థులైన అధికారులు తిష్ట వేయడంతో ఈ గతి పట్టింది. ఈరోజు వరకు వేలాది ఖాళీలున్నా నేటికీ ఆరేళ్ళు కావస్తున్నా భర్తీ చేసిన పాపాన పోలేదు. బడులు, కాలేజీలు, యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థలు ఇప్పటికే పనిచేయడం మానేశాయి. మొత్తం ఇంచార్జీల సార్లతో నడుస్తున్నాయి. ఇక కేజీబీల సంగతి చెప్పనక్కర్లేదు. విద్యా శాఖ కార్యదర్శి ఏం చేస్తున్నారో ఆయనకే తెలియాలి. తాజాగా దేశ వ్యాప్తంగా ట్రైబల్ లిటరసీ గురించి ఏ రాష్ట్రం ఏ పొజిషన్ లో వుందో కేంద్ర సర్కార్ వెల్లడించింది. నిన్నటి దాకా బీరాలు పలికిన విద్యాశాఖాధికారులు విస్తు పోయేలా షాక్ ఇచ్చింది. చదువులో చాలా వెనుకబడి ఉన్నదన్న విషయాన్ని స్పష్టం చేసింది.
కేవలం 49.5 శాతం అక్షరాస్యత రేటుతో మొత్తం 31 రాష్ర్టాల్లో 30వ స్థానంలో నిలిచింది. ఎస్టీల్లో లిటరసీ రేటు దేశంలో సగటున 59 శాతం ఉండగా, తెలంగాణలో దాదాపు పదిశాతం తక్కువ నమోదైంది. అతి తక్కువ అక్షరాస్యతతో కింది నుంచి మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. గిరిజనులను అక్షరాస్యులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశ పెడుతున్నా, అవి అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేక పోతున్నాయి. ఎస్టీల్లో స్కూల్ లెవల్లో భారీగా డ్రాపౌట్స్ నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. దేశ అక్షరాస్యత సగటు 73 శాతం ఉండగా, రాష్ర్ట విభజన తర్వాత రాష్ట్రంలో లిటరసీ 66.54 శాతంగా ఉన్నది.
2014లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ర్ట జనాభా 3.63 కోట్లు కాగా, ఇందులో గిరిజన జనాభా 36.02 లక్షలుగా ఉంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాల్లోనే ట్రైబల్ జనాభా ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం గిరిజన శాఖ, విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్కూళ్లు కొనసాగిస్తోంది. అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాల్లో లిటరసీ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. అయినా రాష్ట్రంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. విద్యాహక్కు చట్టం రావడంతో బడుల్లో గిరిజన స్టూడెంట్లు చేరుతున్నా, వివిధ కారణాలతో మధ్యలోనే బడి మానేస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. దేశంలో గిరిజన అక్షరాస్యత 59 శాతంగా ఉంది.
31 రాష్ర్టాల్లో 50 శాతంలోపు లిటరసీ రేటు ఉన్న రాష్ర్టాలు రెండే ఉండగా, అవి తెలుగు రాష్ర్టాలే కావడం గమనార్హం. రాష్ట్రంలో గిరిజన అక్షరాస్యత 49.5 శాతం కాగా, మొత్తంగా అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ 48.8 శాతం నిలిచింది. గిరిజన లిటరసీలో లక్షదీప్ 91.7 శాతం టాప్ లో ఉండగా, మిజోరం 91.5 శాతం, సిక్కిం 79.7 శాతం, త్రిపుర, గోవా 79.1శాతం తర్వాతి స్థానాల్లో నిలిచాయి. లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి ఇచ్చిన లెక్కలతో ఈ వివరాలు బయట పడ్డాయి. గిరిజన స్టూడెంట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏకలవ్య స్కూల్స్, కేజీబీవీలు పెట్టి, వాటి నిర్వహణకు భారీగా నిధులు అందిస్తోంది.
స్కూల్, కాలేజీ లెవల్స్ వరకు ఎస్టీ స్టూడెంట్ల కోసం ఎక్కువే కేటాయిస్తోంది. దేశ వ్యాప్తంగా గిరిజనుల విద్య కోసం 2016–17లో 5,576 కోట్లు, 2017–18లో 6,281.46 కోట్లు, 2018–19లో 6,176 కోట్లు కేటాయించింది. 2018–19లో స్కూల్ ఎడ్యుకేషన్‌కు 4,924.65 కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్‌కు 1,251.48 కోట్లు ఇచ్చింది. తెలంగాణలోనూ జనాభాకు అనుగుణంగా నిధులొచ్చాయి. అయినా గిరిజన అక్షరాస్యతలో పెద్దగా మార్పు కనిపించడం లేదని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేసారో అధికారులే చెప్పాలి. అవి ఎవరి బొక్కలోకి చేరాయో విచారణ చేపడితే తేలుతుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి