శ్రీకృష్ణం..ప్రభుపాదం

కృష్ణా నీవే అంటూ హరిహరన్ పాడుతుంటే మనసు అలౌకికమైన దారుల్లో సంచరిస్తుంది. ఉన్నాడో లేడో తెలియని సందిగ్ధావస్థ స్థితిలోంచి కోట్లాది జనాన్ని భక్తులుగా మార్చిన ఘనత ఆ కృష్ణుడిదే. వెన్న దొంగగా, ఆరాధ్య దైవంగా వినుతికెక్కిన ఆయన బోధించిన భగవద్గీత ఇవాళ ప్రతి ఇంట్లోకి చేరిపోయింది. ఎంతలా అంటే విడదీయలేనంతగా. ప్రతి చోటా..ప్రతి నోటా కృష్ణా అన్న పదమే వినసొంపుగా..వినమ్రంగా..విశ్వ వ్యాప్తంగా..నిత్యం..నిరంతరం..లోకమంతటా వినిపిస్తోంది. ఎలాంటి భేషజాలు లేకుండా..అహం అన్నది దరిచేరకుండా మనుషులుగా ఎలా ఉండాలో..ఎలా వ్యవహరించాలో..ఎలా బతకాలో బోధించారు..కోట్లాది భక్తులకు తన ప్రవచనాల ద్వారా సందేశాలను చేరవేశారు. ఈ ప్రపంచ గతి శీలతను మార్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ లోకాన్ని సంస్కరించిన మహానుభావులు లక్షలాది మంది ఉన్నారు. వారిప్పుడు భౌతికంగా లేరు. కానీ వారు సూచించిన మార్గాలు, వారు నడిచిన అడుగు జాడలన్నీ నేటికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. దైవం సమానం..కానీ మన మనస్సులు మాత్రం ఒక చోట కుదురుగా ఉండవు. ఉండలేవు కూడా. ఎందుకంటే స్పందించే గుణం వీటికి మాత్ర...