జూలు విదిల్చిన కలాలు .. సైరాకు బలాలు..!

నీ దగ్గర కత్తులున్నాయా .. సమాజాన్ని భయపెట్టే తూటాలున్నాయా..ప్రపంచాన్ని భయపెట్టే ఆయుధాలు, అణుబాంబులు ఉన్నాయా ..పర్వాలేదు కానీ మొనదేరిన, పదునెక్కిన కలాలు మాత్రం ప్రాణం పోసుకుంటే మరింత ప్రమాదం అని రాజులు, డిక్టేటర్లు భయపడి పోయారు. కాలాలకు అంత బలమున్నది. అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్నాడు ప్రజాకవి కాళోజి నారాయణ రావు. నిత్యం మెదళ్లతో కుస్తీ పడుతూ క్రియేటివిటీ కోసం తపన పడే వారిలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, గాయనీ గాయకులూ, ఆర్టిస్టులు, సృజనాత్మకతను కలిగినవారు ఉన్నారు. వీళ్ళు లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో చీకటి మయమై పోయేది. జీవితాన్ని, ప్రపంచాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే రంగాలలో మొదటిది సినిమా రంగం. ఇక్కడ క్రియేటివిటీ కలిగిన వారికే ఎక్కువగా అవకాశాలు తలుపు తడుతాయి. సినిమా అంటేనే 24 కళలు ఉండాల్సిందే. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసే మూవీ సక్సెస్ కావాలంటే వందలాది మంది ఏక కాలంలో కష్టపడాల్సిందే. వీరందరిని సమన్వయం చేసుకుంటూ సినిమాను నడిపించాలి. లేకపోతే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. సినిమా అన్నది పూర్తిగా రిస్క్ తో కూడుకుని ఉంటుంది. స్టోరీ తో పాటు డైల...