ఎందుకిలా..ఎన్నాళ్లిలా..!
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మాట్లాడేందుకు, ప్రశ్నించేందుకు కొంచెమైనా స్వేచ్ఛ ఉండేది. 14 ఏళ్ళ పాటు సుదీర్ఘమైన పోరాటానికి ఊపిరి పోసిన తెలంగాణ చివరకు ఎన్నో బలిదానాల, త్యాగాల సాక్షిగా నూతన రాష్ట్రంగా ఏర్పడింది. అయినా ఇక్కడ మాట్లాడటం నేరంగా మారింది. నిధులు, నీళ్లు, నియామకాల కోసం లక్షలాది మంది జనం రోడ్డెక్కారు. తమ విలువైన కాలాన్ని కోల్పోయారు. వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు. భావించారు కూడా. రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం సంక్షేమ పథకాల జపం చేస్తున్నది కానీ యువతీ యువకుల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇంకొందరు ఇతర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు. గులాబీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది.
ఈసారైనా కనీసం ఉన్న పోస్టులలో కొన్నింటినైనా భర్తీ చేస్తారని అనుకున్నారు నిరుద్యోగులు. అయినా సర్కార్ నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. విపక్షాలు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇటు వైపు చూడడం లేదు. ఇక కొలువుల కోసం కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. రాను రాను కొలువుకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్హతలు ఉన్నా, వయసు రీత్యా సరిపోక పోవడంతో లబోదిబోమంటున్నారు. అయినా చలనం లేదు..స్పందన లేదు. ఇలా ఎంత కాలం మౌనంగా ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఇన్నేళ్ళవుతున్నా విద్య, ఆరోగ్య, ఆర్ధిక రంగాలు కునారిల్లి పోయాయి. ఇక విద్యా రంగం అయితే అధికారులు ఎవరో, ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కేజీ టూ పీజీ జపం చేస్తున్నారు తప్పా అసలు చదువు చెప్పేందుకు కావాల్సిన టీచర్ పోస్టులను మాత్రం భర్తీ చేయడం లేదు.
మరో వైపు ఎస్ సి గురుకులాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. కానీ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు భర్తీ చేయడం లేదు. ఇక యూనివర్సిటీలలో ఈరోజు వరకు పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదు. నిధులు కేటాయించలేదు. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల కు పైగా వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయని నిరుద్యోగులు చెబుతున్నారు. మొత్తం మీద మరో రెండేళ్ల దాకా వీటి భర్తీ గురించి ఆలోచించనట్టుంది. గేదెలు, గొర్రెలు, వ్యవసాయం, స్వయం కృషిని నమ్ముకోవడమే మిగిలింది నేటి తరానికి. అది కూడా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి