సైరా సెన్సేషన్ ..మెగా బిగ్ హ్యాపీ
తెలంగాణకు చెందిన డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహ్మ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సైరా నరసింహ్మ రెడ్డి భారీ వసూళ్లతో రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా కలెక్షన్లలో సునామి సృష్టిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి కొడుకు, నటుడు రామ్ చరణ్ నిర్మించారు. ఊహించని రీతిలో ఈ సినిమా మొదటి నుంచే హైప్ క్రియేట్ చేస్తూ దూసుకు వచ్చింది. సినిమా మార్కెట్ లో సైరా సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఓ రకంగా సురేందర్ రెడ్డికి భారీ హిట్ లభించినట్లయింది. మరో వైపు మెగా స్టార్ కు ఇది ఊహించని రీతిలో సంతోషాన్ని కలిగించింది. ఎక్కడ చూసినా జనం నుంచి ఆదరణ లభిస్తోంది. యువతీ యువకులు, పెద్దలు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున సైరా సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు.
సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది ఈ మూవీ. తెలుగు సినిమా రంగానికి చెందిన అన్ని విభాగాలకు చెందిన వారంతా ఈ సినిమాను చూసి విస్తు పోయారు. మెగాస్టార్ చిరంజీవిని ప్రశంశలతో ముంచెత్తారు. ప్రముఖ డైరెక్టర్లు త్రివిక్రం శ్రీనివాస్, సుకుమార్, హరీష్ శంకర్, ఎస్ ఎస్ రాజమౌళి, తదితరులు సురేందర్ రెడ్డిని, చిరంజీవిని అభినందనలతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు ప్రాణం పోశారని చెప్పారు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయన తార, తమన్నా లతో పాటు రత్నవేలు అద్భుతమైన రీతిలో పని చేశారంటూ పేర్కొన్నారు. పాన్ ఇండియా పరంగా చూస్తే భారీ స్పందన లభిస్తోంది. అయితే సినిమా వర్గాల అంచనా ప్రకారం 180 కోట్లకు పైగా సైరా సినిమా వసూళ్లు చేసినట్టు అంచనా.
రాబోయే రోజుల్లో ఈ అంకెలు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయిలో సినిమాలను రూపొందిస్తోంది. నిన్నటి దాకా 100 కోట్లు ఉన్న సినిమా బడ్జెట్ ఇప్పుడు 250 కోట్ల రూపాయలను దాటేసింది. ఇది కూడా సినీ పెద్దలను, టెక్నీషియన్స్ ను ఆలోచనలో పడేసింది. ఎస్.ఎస్. రాజమౌళి తీసిన బాహుబలి భారీ వసూళ్లను రాబట్టింది. ఇటీవల ప్రభాస్ తో తీసిన సాహో సినిమా బిగ్గెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ సినిమా పరంగా చూస్తే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది కూడా మార్కెట్ ను షేక్ చేసింది. సినిమా పరంగా చూస్తే గతంలో సినిమా తీస్తే కనీసం ఓ నెల రోజుల పాటు వెయిట్ చేయాల్సి వచ్చేది నిర్మాతలకు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేవలం వారం రోజుల్లోనే ఖర్చు చేసిన డబ్బులన్నీ వస్తున్నాయి. రెండు రోజుల్లోనే మూవీ హిట్టా లేక ఫట్టా అన్నది తేలిపోతోంది. ఏది ఏమైనా సురేందర్ రెడ్డి తీసిన సైరా ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారడం విశేషం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి