కథలు రాసేంత వరకే రాజులం.. ఆ తర్వాత బానిసలం ..త్రివిక్రం..!

జీవితాన్ని ఆవిష్కరించాలన్నా, దాని గురించి చెప్పాలన్నా అది ఒక్కరికే సాధ్యం. అయితే కళాకారులైనా ఉండాలి లేదా చేయి తిరిగిన రచయితలైనా కావాలి. తెలుగు సినిమా పరిశ్రమలో క్రియేటివ్ కలిగిన వారు లెక్కించ లేనంత మంది కొలువుతీరి ఉన్నారు. ఒకప్పుడు సినిమా అంటే ఒక్కో విభాగానికి ఒక్కొక్కరు సహాయం అందించే వారు. అన్నిటికంటే డైరెక్టర్ దే కీలకంగా ఉండేది. కథ డామినేట్ చేసేది. కానీ ఇప్పుడు కాలం మారింది. సినిమా కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగా కొంత మేరకు హీరో డామినేటెడ్ సినిమాలు ఉండేవి. అది కూడా పోయింది. దాని స్థానంలో కొత్త వారు, కొత్త టాలెంట్ కలిగిన వాళ్ళు ఉప్పెనలా దూసుకు వచ్చారు. ఇందుకు టెక్ దిగ్గజం గూగుల్ కు కృతజ్ఞతలు చెప్పు కోవాలి. ఎందుకంటే అది యూట్యూబ్ ను కొనుగోలు చేశాక దాని స్వరూపమే మారి పోయింది.

కోట్లాది వీడియోలు రోజూ ప్రపంచ వ్యాప్తంగా అప్ లోడ్ , డౌన్ లోడ్ అవువుతూనే ఉన్నాయి. అసలు సినిమా తీయాలంటే ఎక్కువ సమయం, కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం తలకు మించిన భారంగా మారింది. దీనికి చెక్ పెట్టింది యూట్యూబ్. ఒక్క పైసా ఖర్చు లేకుండానే టాలెంట్ వుంటే చాలు, చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే ఇంకేం అక్కర్లేదు. అప్ లోడ్ చేయడం. డాలర్లు వెనకేసు కోవడం మాత్రమే మిగిలి ఉంది. దీంతో తెలుగు సినిమాలో అవకాశాలు ఇస్తామంటూ ఆధిపత్యం చెలాయిస్తూ, శాడిస్టిక్ గా ప్రవర్తించే వారికి చెంప పెట్టు. ఇక తెలుగు సినిమా రంగం వరకు చూస్తే చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. అలాంటి కోవలో నుంచి వచ్చిన తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయి పోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మంది యూట్యూబ్ స్టార్స్ గా మారి పోయారు. లక్షలాది వ్యూస్ ను పొందుతూ తామేమిటో ప్రూవ్ చేసుకుంటున్నారు.

ఇప్పుడు పేదల పాలిట యూట్యూబ్ ఓ వరంలా..అక్షయపాత్రలా ..దైవంలా మారింది.  చాలా మంది రచయితలుగా మరీనా వారు దర్శకులుగా అవతారం ఎత్తారు. అలాంటి వారిలో కొరటాల శివ, హరీష్ శంకర్, పరశురామ్, పోసాని కృష్ణ మురళి, సురేందర్ రెడ్డి , పైడిపల్లి వంశీ , బోయపాటి శ్రీను , త్రివిక్రం శ్రీనివాస్ ఇలా ఎందరో బెస్ట్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సైరా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సక్సెస్ సందర్బంగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్ త్రివిక్రం. మెగాస్టార్ ను ఆయనే స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్బంగా సినిమా రంగంలో రావాలని అనుకున్న వారికి ఇది కనువిప్పు కలిగిస్తుంది. అదేమిటంటే కథలు రాసేంత వరకే మనం రాజులం..ఆ తర్వాత మనమంతా బానిసలం అని సెలవిచ్చారు. అందుకే త్రివిక్రం తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం. కాదనగలమా..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!