మధురం..అధరామృతం..పుల్లారెడ్డి స్వీట్స్ అదుర్స్..!

తాతలు, తల్లిదండ్రులు, వారి పిల్లలు ఇలా ప్రతి తరం జి.పుల్లారెడ్డి స్వీట్స్ ను రుచి చూసిన వారే. ఇంతటి ప్రాచుర్యం పొందిన మిఠాయిలు ఈ దేశంలో ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకే ఒక్క సామాన్యమైన వ్యక్తి అసమాన్యమైన ..అసాధారణమైన..నభూతో న భవిష్యత్ అన్న రీతిలో సాధించిన అపురూపమైన గెలుపు గాథ ఇది. నాణ్యత, నమ్మకం, సేవ ఇవే పుల్లారెడ్డి సక్సెస్ కు మూల కారణం. దాదాపు 71 సంవత్సరాలు అంటే ఏడు దశాబ్దాలు గడిచి పోయాయి. కానీ తరాలు మారినా రుచిలో, శుచిల ో, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అప్రహతిహతంగా సాగి పోతూనే ఉన్నది. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేరున్న కర్నూల్ జిల్లాకు చెందిన జి. పుల్లారెడ్డి అనే వ్యక్తి మదిలో మెదిలిన ఈ ఆలోచనే, నేడు మాహా వృక్షమై వేలాది మందికి నీడనిస్తోంది. కోట్లాది మందికి మిఠాయిల రుచిని పంచుతోంది. ఒకప్పుడు సైకిల్ మీద పాల కోవాను తయారు చేసుకుని, ఇల్లిల్లు తిరుగుతూ రోడ్ల మీద అమ్ముకుంటూ ప్రారంభమైన పుల్లారెడ్డి దుకాణం ఇప్పుడు అతి పెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందింది. అంతే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు ఆసరాగా ఉంటోంది. మిఠాయిలతో పాటు ప్రతి రోజు ప్రతి కుటుంబం నిత్యం వాడుకునే పచ్చళ్ళు, ...