!..శివన్ నీకు సలాం..!

ఈ దేశం సాక్షిగా ..130 కోట్ల మంది నిన్ను చూసి గర్విస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తయారు చేసిన..చంద్రయాన్ -2 ..చివరి క్షణాల్లో  లింక్ తెగి పోయినప్పుడు మీరు పడిన ఆవేదన..కార్చిన కన్నీళ్లు ..చిన్న పిల్లాడిలా బోరుమన్న తీరు ఎందరినో ఆలోచించేలా చేసింది. ఈ దేశం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న వాళ్ళు ఎందరో. గనుల్లో , కంపెనీలలో ఇలా చెప్పుకుంటూ పోతే, దేశ సరిహద్దులో ప్రాణాలు లెక్క చేయకుండా పహారా కాస్తున్న సైనికుల ముందు ఎంత. అవును ఎంతగా కష్టపడితే తయారవుతుంది. ఎంత మంది మెదళ్ళు వత్తిళ్లకు లోనై తీర్చి దిద్దితే చివరి నిమిషంలో కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. అది దగ్గరుండి చూస్తేనే, అనుభవిస్తేనే తెలుస్తుంది. అవగతమవుతుంది.

శివన్ మనలాంటి వ్యక్తే. కాక పోతే కస్టపడి చదువుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఇవ్వాళ జాతిగర్వించే సమున్నతమైన అంతరిక్ష పరిశోధనా కేంద్రంకు ఆయన చైర్మన్ గా ఉన్నారు. ఇది మామూలు పదవి కాదు. ఈ దేశపు పునాదుల్లో ఒక స్థంభం లాంటి సంస్థ అది. అక్కడ ప్రతి నిమిషం కోట్లాది రూపాయలతో సమానం. అందుకే దివంగత ప్రెసిడెంట్ కలాం ఇలాంటి శాస్త్రవేత్తలే ఈ దేశానికి కావాలని కోరారు. శివన్ ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని అనుకుంటారు. ఎందుకంటే వారికి ఈ గెలుపు ..ఈ సక్సెస్ వ్యక్తిగతమైనది కాదు..కానీ కోట్లాది ప్రజల ..దేశపు గౌరవం, ప్రతిష్ఠతతో ముడి పడి ఉన్నది. అందుకే అంతటి వత్తిడి. ఎక్కడ కూడా శివన్ చెక్కు చెదరలేదు. కానీ చివరి వరకు ఊరించిన చంద్రయాన్ ఆఖరు నిమిషం తేడాలో చిక్క కుండా పోవడం బాధ కు గురి చేసింది.

ఎందరికో దిశా నిర్దేశం చేసే ఈ శాస్త్రవేత్త దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీని చూసి కన్నీళ్లను ఆపు కోలేక పోయారు. దుఃఖాన్ని గమనించిన మోదీజీ ఆలింగనం చేసుకున్నారు. వెన్ను తట్టి ఈ దేశం మీ వెంట ఉందంటూ భరోసా ఇచ్చారు. ఇదీ ..ఇలాంటి సన్నివేశాలు అరుదుగా చోటు చేసుకుంటాయి. కన్నీళ్లు కొన్నే కావచ్చు. కానీ దానికి భాష ఉండదు. కోల్పోవడమే తప్ప. ఈ అనితర సాధ్యమైన ..ఇస్రో శాత్రవేత్తలు చేసిన ప్రయత్నం గొప్పది. ఈ దేశం కోసం పని చేసే వాళ్ళు కావాలి. పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్స్ లలో ..డాలర్ల జపం చేస్తూ అమెరికా అంటూ కలవరిస్తున్న ప్రబుద్ధులు శివన్ ను చూసి నేర్చుకోవాలి. అవును మేరా భారత్ మహాన్శి కదూ ..శివన్ నీకో సలాం..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!