సై..సైరా.. సురేందర్ రెడ్డి..!

వంగా సందీప్ రెడ్డి. సుజీత్ రెడ్డి. నాగేశ్వర్ రెడ్డి..సురేందర్ రెడ్డి ..వీళ్లంతా ఇప్పుడు టాలీవుడ్ లో దమ్ము రేపుతున్న దర్శకులు. తాము తీసిన సినిమాలతో తెలుగు సినిమాకు కొత్త రేంజ్ తీసుకు వచ్చారు, ఇండియా వ్యాప్తంగా. తాజాగా సుజీత్ రెడ్డి డార్లింగ్ ప్రభాస్ తో ఏకంగా 350 కోట్లతో సాహో సినిమా తీశాడు. అతి పెద్ద సాహసం చేశాడు. అంతేనా ఓవర్ సీస్ లో ఇప్పటికే రికార్డులను బ్రేక్ చేసింది ఈ మూవీ. ఏకంగా వసూళ్ళలో రెండో ప్లేస్ లో నిలిచింది. చరిత్ర తిరగ రాసింది. మరో వైపు ఇండియన్ మెగాస్టార్ చిరంజీవితో డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి  తాజాగా వైరల్ గా మారారు. ఆయన ఇప్పటికే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల జాబితాలో ఉన్నారు. పవర్ ఫుల్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ , హీరో ఓరియెంటెడ్ ఎక్కువగా ఉండేలా సినిమాలు తీయడంలో మనోడు ఎక్స్ పర్ట్.

ఇప్పుడు చిరంజీవితో సైరా నరసింహ్మ రెడ్డి పేరుతో భారీ సినిమా తీస్తున్నాడు. అది కూడా పూర్తి అవుతుంది. దీని కోసం ఇప్పటికే బయ్యర్స్ పోటీ పడుతున్నట్లు, కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. చిరంజీవికి వున్న ఇమేజ్, భారీ తారాగణం తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించడం. సినిమాను రిచ్ గా తీయడం కూడా సినీ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది. సురేందర్ రెడ్డి సినిమా హాయిగా , అందరూ చూసేలా ఉంటుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. తెలంగాణ రాష్ట్రం లోని కరీం నగర్ జిల్లా మాచినపల్లి గ్రామం ఆయనది. మొత్తం ఆరుగురిలో సురేందర్ రెడ్డి నాలుగో వాడు. దేనికీ లోటులేని సంసారం. రాజకీయంగా కూడా బాగా పలుకుబడి ఉన్న కుటుంబం.

డిగ్రీకి మధ్యలోనే గుడ్ బై చెప్పేసి హైదరాబాదు వచ్చేశాడు. మణిరత్నం ఘర్షణ, వర్మ శివ ఇతడి మీద చాలా ప్రభావం చూపించాయి. సినిమా విజయంలో దర్శకుడికి గల పాత్రనీ, తలచుకుంటే సృష్టించ గలమని నమ్మాడు మనోడు. అయితే సినిమాల్లో అవకాశం అనేది అంత సులువు కాదని తెలుసుకున్నాడు. అయినా పట్టుదల కోల్పోలేదు. తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. 2005 కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే తీశాడు. నడిచింది. ఎన్ఠీఆర్ తో అశోక్ , మహేష్ బాబు తో అతిథి , రవితేజతో కిక్ , జూనియర్ తో ఊసరవెల్లి , అల్లు అర్జున్ తో రేసు గుర్రం, చరణ్ తో ధృవ తీశాడు. దీంతో చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు .సైరా నరసింహ్మ రెడ్డి తో మరోసారి తన సత్తా ఏమిటో రుచి చూపించాలని వెయిట్ చేస్తున్నాడు. అంతేనా ఈ సినిమా టీజర్ విడుదల చేస్తే కోటి మందికి పైగా దీనిని వీక్షించారు. ఇది ఓ రికార్డ్. విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో . 

కామెంట్‌లు