షావోమి సెన్సేషన్.. 5 ఏళ్ళల్లో 100 మిలియన్స్ ..అమ్మకాల్లో టాప్..!
టెక్నాలజీ పెరగడంతో జనానికి అవసరాలు పెరిగి పోయాయి. దీంతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అన్నది నిత్య అవసరంగా మారి పోయింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నోకియా, మోటరోలా, ఆపిల్ , సామ్ సంగ్ కంపెనీల మొబైల్స్ తో పాటు వివో, షావోమి , ఒప్పో, వన్ ప్లస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీలు వరల్డ్ మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో ఆపిల్ , సామ్ సంగ్ ల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. మొత్తం మొబైల్స్ మార్కెట్ ను చైనా దేశంలో తయారైన కంపెనీలకు చెందిన మొబైల్స్ డామినేట్ చేస్తున్నాయి. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్స్ లభిస్తుండడంతో దెబ్బకు దిగ్గజ కంపెనీల మొబైల్స్ అమ్మకాలు తగ్గి పోయాయి.
ఇప్పుడు వరల్డ్ లోనే అతి పెద్ద మార్కెట్ అటు ఆఫ్ లైన్ లోను ఇటు ఆన్ లైన్ లోను ఇండియా ఉంటోంది. ఇక్కడి జనం విపరీతంగా ఏది పడితే అది కొనేందుకు పోటీ పడుతున్నారు. దీనిని చైనా కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇతర కంపెనీల మాటేమిటో కానీ ఈ కంపెనీల మధ్యనే పోటీ ఎక్కువగా ఉంటోంది. ఇది మార్కెట్ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది. తాజాగా చైనాకు చెందిన షావోమి స్మార్ట్ ఫోన్స్ , యాక్సెస్సరీస్ తో పాటు లెడ్ టీవీలను లాంచ్ చేసింది. ఈ కంపెనీ తయారు చేసే ప్రాడక్ట్స్ కు ఇండియాలో విపరీతంగా డిమాండు ఉంటోంది. దీంతో సదరు కంపెనీ ఏకంగా ఇండియాను టార్గెట్ చేసింది. ఇదే దేశానికి చెందిన మను కుమార్ జైన్ ను కంట్రీ హెడ్ గా నియమించింది. దెబ్బకు కంపెనీ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశాడు.
ప్రత్యర్థి కంపెనీలకు అమ్మకాల్లో దడ పుట్టిస్థూ కంటి మీద కునుకే లేకుండా చేశాడు. దేశంలో ప్రతి చోటా షావోమి స్టోర్స్ ఏర్పాటు చేశాడు. పూర్తి డిస్కౌంట్స్ ప్రకటించాడు. ఆఫ్ లైన్ లో ను ఇటు ఆన్ లైన్ లోను భారీ ఆఫర్స్ తో షావోమి అమ్మకాలు పెరిగేలా చేశాడు. చాప కింద నీరులా ఏకంగా 5 ఏళ్లల్లో 100 మిలియన్ల షావోమి స్మార్ట్ మొబైల్స్ అమ్ముడు పోయేలా చేశాడు. ఇదంతా జైన్ సాధించిన విజయం. దీంతో తాజాగా సిబ్బంది, ఉద్యోగులతో కలిసి మను కుమార్ జైన్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. 20 మిలియన్ ఫోన్స్ ప్రతి ఏడాదిలో అమ్ముడు పోయాయి. 1 .67 మిలియన్స్ ప్రతి నెలలో అమ్ముడవుతే , ప్రతి నిమిషానికి 38 ఫోన్లను జనం కొనుగోలు చేశారు. ఇదీ షావోమి సాధించిన రికార్డ్. సో.. ఎవరన్నారు ఆర్ధిక ఇబ్బందుల్లో ఇండియా ఉందని ఈ అమ్మకాలు చూస్తే తెలియడం లేదా మన వద్ద డబ్బులు ఉన్నాయని..మార్కెట్ కు ఢోకా లేదని కదూ. హ్యాట్స్ ఆఫ్ యూ ..మెనూ కుమార్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి